రానా - సాయి పల్లవి హీరోహీరోయిన్స్ గా వస్తున్నా చిత్రం ‘విరాటపర్వం’. 1980ల్లో తెలంగాణ పల్లెల్లో ఉన్న నక్సల్ ఉద్యమం నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ తో తెరకెక్కుతోందని సమాచారం. ఇక ఇందులో సీనియర్ నటి టబు ఓ కీలక పాత్రలో నటించాల్సిఉంది కానీ ఆమెకు బాలీవుడ్ లో పలు సినిమాలు ఉండడంతో ఆమె ఈసినిమా నుండి తప్పుకుంది. ఈ తప్పుకోవడంతో ఆమె ప్లేస్‌లో కి మరో సీనియర్ హీరోయిన్ నందిత దాస్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిన్ననే ఆమెపై సన్నివేశాలు చిత్రకరించడం స్టార్ట్ చేసారు.
ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న నందిత దాస్ ఈచిత్రంలో సీతక్క అనే నక్సల్ పాత్రలో నటించనుంది. ముందుగా ఈ పాత్రకు టబుని అనుకున్నారు కానీ ఆమె బాలీవుడ్ సినిమాలతో పాటు అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమాలతో బిజీ అవ్వడంతో విరాటపర్వం కి నో చెప్పేసింది. సో ఆమె ప్లేస్ లోకి నందిత దాస్ వచ్చింది.
సినిమాలో రానా, సాయి పల్లవి పాత్రలు తరువాత అత్యంత కీలకమైన పాత్ర నందిత దాస్ దే. ఈమె పాత్ర సినిమాకి హైలైట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. డైరెక్టర్ వేణు ఉడుగుల నందిత కి కథ చెప్పడం ఆమెకు కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు లో నందితకు ఇదే స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడం విశేషం.