Advertisementt

పూరి ఫిక్సయ్యాడు.. మరి రామ్ సంగతేంటి?

Wed 14th Aug 2019 01:00 PM
puri jagannadh,vijay deverakonda,ram,confusion mode  పూరి ఫిక్సయ్యాడు.. మరి రామ్ సంగతేంటి?
Puri next Project Announced.. What about Ram? పూరి ఫిక్సయ్యాడు.. మరి రామ్ సంగతేంటి?
Advertisement
Ads by CJ

ఇస్మార్ట్ శంకర్ తో ఘనవిజయం అందుకున్న పూరి ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న టైములో యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకి ఓ లైన్ చెప్పి ఓకే చేయించుకున్నాడు. నిన్న అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగిపోయింది. వీరి కాంబినేషన్ లో సినిమా అంటే ఇప్పటి నుండే అందరికి క్యూరియాసిటీ ఎక్కువ అయిపోయింది. పైగా పూరి ఆటిట్యూడ్ కి విజయ్ ఆటిట్యూడ్ తోడైతే అది ఆలోచిస్తేనే మతిపోతుంది. అయితే పూరి మహేష్ తో జనగణమన అనే సినిమా చేద్దాం అనుకున్నాడు కానీ మహేష్ ఇంట్రెస్ట్ చూపకపోవడంతో అదే స్క్రిప్ట్ ను ఇప్పుడు విజయ్ తో చేస్తున్నాడు అని వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు పూరి - విజయ్ చేస్తున్న సినిమా అదేనా లేక వేరే సబ్జెక్టు అని తెలియాల్సిఉంది.

ఇక ఇస్మార్ట్ శంకర్ రామ్ మాత్రం తన నెక్స్ట్ ఏంటో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే రామ్ నేను శైలజ వంటి క్లాస్ హిట్ ఇచ్చిన దర్శకుడు కిషోర్ తిరుమల ఓ కథ వినిపించగా, రామ్ పెదవి విరిచారని సమాచారం. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలి. రీసెంట్ గా రామ్ గుండు చేయించుకొని ఫ్రెంచ్ గడ్డంతో ఉన్న ఓ కొత్త అవతారంలో రామ్ కనిపించడం జరిగింది. మరి ఇది తన నెక్స్ట్ మూవీ కోసమా లేదా సరదాగా చేశాడా అని తెలియాలి.

Puri next Project Announced.. What about Ram?:

Puri Fixed with Vijay Deverakonda.. Ram in Confusion Mode

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ