స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను కాకినాడలో చిత్రీకరించడం జరిగింది. అయితే పంద్రాగస్టు నాడు బన్నీ, మెగా ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ఫ్రైజ్ ఇవ్వడానికి చిత్రబృందం సిద్ధమైంది.
సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటికీ ఇంతవరకూ టైటిల్‌ను మాత్రం ఫిక్స్ చేయలేదు. ఇప్పటికే ‘నేను - నాన్న’ అనే పేరుతో తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌ను త్రివిక్రమ్ పండిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది పక్కా అని మాత్రం చిత్రబృందం అంగీకరించలేదు. అందుకే పంద్రాగస్టు రోజున బన్నీ ఫ్యాన్స్ ఇచ్చే బిగ్ సర్‌ఫ్రైజ్ టైటిల్ రివీల్ చేయడమేనని ట్విట్టర్ ద్వారా మాటల మాంత్రికుడు స్పష్టం చేశాడు.
మొత్తానికి చూస్తే.. పంద్రాగస్టు రోజున బన్నీ ఫ్యాన్స్‌కు రెండు పండగలన్న మాట. ఈ సింగిల్ ట్వీట్‌తో బన్నీ అభిమానులు ..ఈ సినిమాకి ఏ టైటిల్ ను ఖరారు చేస్తారో..? ఏంటో అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో.. మరో మూడ్రోజులు ఆగితే ఈ నిరీక్షణకి తెరపడనుంది.