Advertisementt

శర్వా, శేష్‌ల ‘రణరంగం’లో గెలిచేది ‘ఎవరు’?

Mon 12th Aug 2019 09:23 PM
ranarangam,evaru,sharwanand,adivi sesh,august 15th,ranarangam vs evaru  శర్వా, శేష్‌ల ‘రణరంగం’లో గెలిచేది ‘ఎవరు’?
Sharwanad Ranarangam vs Adivi Sesh Evaru శర్వా, శేష్‌ల ‘రణరంగం’లో గెలిచేది ‘ఎవరు’?
Advertisement
Ads by CJ

ఎప్పటిలాగే ఈ ఆగస్ట్ లోనూ యంగ్ హీరోల మధ్యన వార్ మొదలైంది. ఈ ఏడాది ఆగస్ట్ 15న శర్వానంద్ తో క్రైమ్ థ్రిల్లర్ స్పెషలిస్ట్ హీరో అడవి శేష్ తలపడుతున్నాడు. పడి పడి లేచే మనసు సినిమా తర్వాత సుధీర్ వర్మతో కలిసి శర్వానంద్ రణరంగం సినిమా చేసాడు. మాస్ మూవీగా తెరకెక్కిన రణరంగం సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. సుధీర్ వర్మ బ్యాగ్రౌండ్ కాస్త డల్ గా ఉన్నప్పటికీ.... శర్వా రణరంగం లుక్స్ దగ్గరనుండి రణరంగం ట్రైలర్ లో కనబడిన కంటెంట్, కాజల్ గ్లామర్, లవర్ బాయ్ గా, సీరియస్ గ్యాంగ్ స్టర్ గా రెండు విభిన్న పాత్రల్లో శర్వా కనిపించబోతున్నాడు. ఇవన్నీ కూడా సినిమా మీద అంచనాలు పెరిగేలా చేశాయి. 

ఇక క్షణం, గూఢచారి సినిమాల దగ్గర నుండి క్రైం, థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అడవి శేష్ సినిమాలన్నా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. ఇప్పుడు అడవి శేష్ నుండి రాబోతున్న ‘ఎవరు’ సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కినదే. అడవి శేష్ వాసుదేవ్ అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ లో చాలా వైలెంట్ గా కనిపించబోతున్నాడు. ఇక హీరోయిన్ రెజీనా హాట్ హాట్ గా రేప్ కి గురైన అమ్మాయిలా, ఒకరిని మర్డర్ చేసిన కేసులో ఇరుక్కుంటుంది. అదే కేసుని అడవి శేష్ కన్నింగ్ యాటిట్యూడ్ కలిగిన పోలీస్ అధికారిగా సాల్వ్ చేయాలనుకుంటాడు. ఇక నవీన్ చంద్ర కూడా విలన్‌గా ‘ఎవరు’ ట్రైలర్ లో కాస్త మెరుపులు మెరిపించి.... సినిమాలో నవీన్ చంద్ర పాత్రపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడేలా చేశాడు. 

ఈ రెండు చిత్రాలు విభిన్నమైన జానర్స్ కి సంబంధించిన సినిమాలు కావడంతో.. రెండు సినిమాల మీద ప్రేక్షకుల్లో బోలెడంత క్యూరియాసిటీ ఉంది. మరి స్వాతంత్య్ర దినోత్సవం రోజున శర్వా, శేష్ లలో అసలు హీరో ఎవరు అనేది తేలిపోతుంది.

Sharwanad Ranarangam vs Adivi Sesh Evaru:

Auguest 15th Release Movies Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ