Advertisementt

ఈ సినిమాతో విజయ్.. చెర్రీని మించిపోతాడా!

Mon 12th Aug 2019 08:52 PM
ram charan,vijay devarakonda,purijagannadh,new movie  ఈ సినిమాతో విజయ్.. చెర్రీని మించిపోతాడా!
Cherri vs Vijaya Devarakonda.. Who wins! ఈ సినిమాతో విజయ్.. చెర్రీని మించిపోతాడా!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో సీనియర్, జూనియర్స్ అంతా డిఫరెంట్ గెటప్స్‌తో కనిపించి వావ్ అనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ‘రంగస్థలం’ సినిమాలో మాటలు వినపడని వ్యక్తి పాత్రలో చెర్రీ నటించగా.. ‘రాజాదిగ్రేట్’ సినిమాలో కళ్లు కనపడని వ్యక్తిగా రవితేజ కూడా నటించి మెప్పించాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ‘జైలవకుశ’ చిత్రంలో నత్తిగా మాటలు సరిగా పలకలేని వ్యక్తిగా నటించి సూపర్బ్ అనిపించుకున్నారు. అయితే తాజాగా ఇదే బాటలోనే విజయ్ దేవరకొండ నడుస్తున్నాడు.

డియర్ కామ్రెడ్ తర్వాత డాషింగ్ డైరెక్టర్ విజయ్-డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో ఓ సినిమా వస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఈ సినిమాలో ఓ డిఫరెంట్‌ గెటప్‌లో విజయ్ మెరవనున్నాడని తెలుస్తోంది. నెత్తిగా నెత్తిగా (మాటలు సరిగ్గా పలకలేని) విజయ్ పాత్ర ఈ సినిమాలో ఉంటుందట. అయితే ఇది ఎంతవరకు నిజం అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఫస్ట్ టైమ్ చెర్రీ డిఫరెంట్ గెటప్‌లో మెప్పించగా.. రామ్‌చరణ్ మించిపోయేలా విజయ్ మెప్పిస్తారని అభిమానులు చెప్పుకుంటున్నారు.

కాగా.. ‘ఇస్మార్ట్ శంకర్‌’ సినిమాతో లాంగ్ గ్యాప్ తర్వాత హిట్ ట్రాక్‌లోకి వచ్చిన పూరీ కోసం కుర్ర హీరోలు క్యూ కడుతున్నారు. వీరిలో విజయ్ కూడా ఉన్నాడట. ఓ సూపర్ క్రేజీ పాత్రను విజయ్ కోసం పూరీ డిజైన్ చేయడమే కాదు.. సొంత నిర్మాణంలో నిర్మించాలని భావిస్తున్నాడట. ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Cherri vs Vijaya Devarakonda.. Who wins!:

Cherri vs Vijaya Devarakonda.. Who wins!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ