Advertisementt

‘డియర్ కామ్రేడ్’ రీమేక్‌లో చేయనన్నాడట!

Mon 12th Aug 2019 03:15 PM
shahid kapoor,not interested,dear comrade,remake  ‘డియర్ కామ్రేడ్’ రీమేక్‌లో చేయనన్నాడట!
Bollywood Hero Says No to Dear Comrade remake ‘డియర్ కామ్రేడ్’ రీమేక్‌లో చేయనన్నాడట!
Advertisement
Ads by CJ

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ చిత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది. సినిమా చాలా స్లోగా ఉండడంతో ప్రేక్షకులు దీన్ని తిరస్కరించారు. ఇది పక్కన పెడితే ఈ సినిమా యొక్క హిందీ రైట్స్ ప్రముఖ బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీ రిలీజ్ కి ముందు స్పెషల్ స్క్రీనింగ్ లో చూసిన కరణ్ ఇది ఓ అందమైన ప్రేమకథ అని, తనకు బాగా నచ్చిందని ట్వీట్‌ చేశారు. అయితే ఈ సినిమా రీమేక్ లో బాలీవుడ్ నటుడు షాహిద్‌ కపూర్‌ను ఎంపిక చేసుకోవాలని కరణ్‌ అనుకున్నారట. అందుకోసం షాహిద్‌ కపూర్‌ ఏకంగా 40 కోట్లు రెమ్యూనరేషన్ అడిగాడట. 

కానీ రీసెంట్ గా అతను ఈ సినిమా చేయను అని చెప్పేసాడు అని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే  షాహిద్‌ కపూర్‌ అర్జున్ రెడ్డి రీమేక్ లో నటించారు. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ లో నటిస్తే  ప్రేక్షకులను ఆకట్టుకోదేమోనన్న ఉద్దేశంతోనే సినిమాకు ‘నో’ చెప్పినట్లు  టాక్.

Bollywood Hero Says No to Dear Comrade remake:

Shahid Kapoor not Interested on Dear Comrade Remake

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ