బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎప్పుడు చూసిన ఈమె తన హాట్ హాట్ వ్యాఖ్యలతో.. హాట్ అందాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక టాలీవుడ్‌లో చేసింది రెండు సినిమాలే అయినా ఈ ముద్దుగుమ్మ చేసిన రచ్చ మాత్రం అంతా ఇంతా కాదు. అప్పట్లో న్యూడ్ షోలు, సెమీ న్యూడ్ షోలతో వివాదాలతో వార్తల్లో నిలవని రోజే లేదు. అయితే ఇంత చేస్తున్నా ఈ హాట్ భామకు రోజులు కలిసిరావట్లేదు.
బాలీవుడ్‌ను ప్రస్తుతానికి టాటా చెప్పేసి.. హాలీవుడ్ చెక్కేసిన ఈ భామకు సొంత ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేయడం గమనార్హం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. బాలీవుడ్ నిర్మాతలు డబ్బులు సరిగ్గా ఇవ్వరని చెప్పుకొచ్చింది. అంతటితో ఆగని ఈ భామ.. బాలీవుడ్‌లో లాగా హాలీవుడ్‌లో రెమ్యునరేషన్ గురించి ఇబ్బందులు పెట్టరని.. అన్నీ అనుకున్నట్లుగానే తేల్చేస్తారన్నది. ప్రాజెక్ట్ పూర్తవ్వగానే లెక్కపూర్తిగా తేల్చేస్తారని చెప్పుకొచ్చింది. మొత్తానికి చూస్తే బాలీవుడ్‌లో ఈమెను ఎవరో బాగానే డబ్బులు విషయంలో ఇబ్బందిపెట్టారని తెలుస్తోంది. ఆ నిర్మాత ఎవరో మరి..! కాగా.. ఈమె ప్రస్తుతం హాలీవుడ్‌లో ‘వెడ్డింగ్ గెస్ట్’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.