Advertisementt

బాలయ్య 105వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్స్!

Sun 11th Aug 2019 04:12 PM
balakrishna,105 film,latest,update  బాలయ్య 105వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్స్!
Balakrishna 105 Film Shooting Started బాలయ్య 105వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్స్!
Advertisement
Ads by CJ

థాయ్‌లాండ్‌లో నటసింహ నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ థాయ్‌లాండ్‌లో ఈరోజు నుండి ప్రారంభమైంది. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మాతగా  కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక చావ్లా, ప్రకాశ్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. 

థాయ్‌లాండ్‌లో జరుగుతున్న ఈ భారీ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సినిమాలోని నటీనటులందరూ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ‘జైసింహా’ వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత బాలక‌ృష్ణ, సి.కల్యాణ్, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంతన్ భట్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. పరుచూరి మురళి కథను అందిస్తున్నారు. 

నటీనటులు:

నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, వేదిక, భూమిక చావ్లా, ప్రకాశ్ రాజ్, జయసుధ, షాయాజీ షిండే, నాగినీడు, సప్తగిరి, కోటేశ్వర్ రావ్, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, ధన్‌రాజ్, బండ రఘు తదితరులు

సాంకేతిక నిపుణులు:

దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్

బ్యానర్: హ్యాపీ మూవీస్

నిర్మాత: సి.కల్యాణ్

కో ప్రొడ్యూసర్స్: సి.వి.రావ్, పత్సా నాగరాజు

కథ: పరుచూరి మురళి

సినిమాటోగ్రఫీ: రామ్‌ప్రసాద్

మ్యూజిక్: చిరంతన్ భట్

ఆర్ట్: చిన్నా

డ్యాన్స్: జానీ మాస్టర్

ఫైట్స్: రామ్ లక్ష్మణ్

పాటలు: భాస్కర భట్ల, రామజోగయ్య శాస్త్రి

Balakrishna 105 Film Shooting Started:

Balakrishna 105 film Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ