Advertisementt

సీఎంని కలవాలని నిబంధన ఉందా?: రాజేంద్రప్రసాద్

Sat 10th Aug 2019 07:25 PM
rajendra prasad,prudhvi,ys jagan,tirumala,chief minister  సీఎంని కలవాలని నిబంధన ఉందా?: రాజేంద్రప్రసాద్
Rajendra Prasad sensational Comments on YS Jagan సీఎంని కలవాలని నిబంధన ఉందా?: రాజేంద్రప్రసాద్
Advertisement
Ads by CJ

నటుడు రాజేంద్రప్రసాద్ రీసెంట్‌గా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగనమోహన్ రెడ్డి సీఎం కాగానే వెళ్లి కలవడానికి సినీ నటులేం వ్యాపారవేత్తలు కాదన్నారు. సినీనటులకు ఖాళీ దొరికినప్పుడు వెళ్లి కలుస్తారని రాజేంద్రప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రిని వెంటనే కలవాలన్న నిబంధన ఏమీ లేదని గుర్తు చేశారు.

జగన్ సీఎంగా సెటిల్ అయిన తర్వాత తీరిగ్గా ఉన్నప్పుడు కలుస్తామన్నారు. అలానే కమెడియన్ ఫృధ్వీని నేరుగా విమర్శించకపోయినప్పటికీ.. ఆయన వ్యాఖ్యలను మాత్రం రాజేంద్రప్రసాద్ తోసిపుచ్చినట్లయింది. ‘జగన్‌గారు సీఎం అవ్వడం సినీ పరిశ్రమకు ఇష్టం లేదనడం తప్పని...ఆయన అలా అని ఉండకూడదు’ అని రాజేంద్రప్రసాద్ అన్నారు.

జగన్‌తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని రాజేంద్ర‌ప్రసాద్‌ చెప్పారు. పోసాని కృష్ణమురళి కూడా ఫృధ్వీ వ్యాఖ్యలను తప్పుబట్టిన విషయం తెలిసిందే. 

Rajendra Prasad sensational Comments on YS Jagan:

Rajendra Prasad Counter on Prudhvi Comments 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ