మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబోలో మొదటిసారిగా ఓ కామెడీ ఎంటర్టైన్మెంట్ సరిలేరు నీకెవ్వరు సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం జోరుగా షూటింగ్ జరుపుంటున్న ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో స్పెషల్ గా వేసిన ట్రైన్ సెట్ లో జరుగుతుంది. ఈ సినిమాలో హిలేరియస్ కామెడీ డైలాగ్స్ ఉంటాయని.. కమెడియన్స్ చేత అనిల్ రావిపూడి అద్భుతమైన కామెడీ పండించబోతున్నట్లుగా తెలుస్తుంది. సరిలేరు నీకెవ్వరు తో మాజీ కమెడియన్ బండ్ల గణేష్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న బండ్ల రోజుకి ఐదు లక్షలు ఛార్జ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ లో కామెడీ విపరీతంగా ఉంటుందనే టాక్ ఉంది. ఇక బండ్ల గణేష్ ఓ కోటీశ్వరుడిగా.. ట్రైన్ జర్నీ చేస్తూ.. ఎలా ఉండాలో తెలియక, తింగరోడిలా ఏదో ఒకటి మాట్లాడుతూ ప్రేక్షకులను నవ్విస్తాడనన్నారు. తాజాగా బండ్ల గణేష్ సరిలేరు నీకెవ్వరులో ఓ దొంగ పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. ట్రైన్ లో ప్రయాణిస్తున్న రావు రమేష్ జేబు కొట్టేసి... తద్వారా తన పాత్ర ద్వారా హిలేరియస్ కామెడీ పండించబోతున్నాడట. అలాగే ట్రైన్ ఎపిసోడ్ మాత్రమే కాకుండా సినిమా క్లైమాక్స్ లో జరిగే పెళ్లి ఎపిసోడ్ లోను బండ్ల నవ్వులు పూయిస్తాడట. మరి బండ్లతో పాటుగా ఈ సినిమాలో చాలామంది కమెడియన్స్ కూడా నటిస్తున్నారట. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కుతుంది.