నాగార్జున - రకుల్ కాంబోలో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన మన్మథుడు 2 ఈ రోజు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుశాంత్ తో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చి.ల.సౌ సినిమా సాలిడ్ హిట్ అవడంతో నాగార్జున దర్శకుడు రాహుల్ ని పిలిచి మన్మథుడు 2 సినిమా బాధ్యతలను అప్పగించాడు. రాహుల్ కూడా చి.ల.సౌ ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆకట్టుకునేలా ప్రేమకథా చిత్రంగా ఆ చిత్రాన్ని మలిచాడు. ఆ సినిమా డీసెంట్ హిట్ కొట్టింది. తాజాగా మన్మథుడు 2 సినిమాని కూడా రాహుల్ అందరూ మెచ్చేలా తెరకెక్కించాడని నాగార్జునే స్వయంగా చెబుతున్నాడు. నాగార్జునకి ఆఫీసర్ లాంటి డిజాస్టర్ తర్వాత వస్తున్న ఈ మన్మథుడు సినిమా హిట్ చాలా అవసరం.
అయితే మన్మథుడు 2 మంచి అంచనాలతో విడుదలవుతుంది గనక... ఆ సినిమాకి ఎంతగా హిట్ టాక్ పడినా.. కేవలం ఆరు రోజుల్లోనే కలెక్షన్స్ ని పోగు చేసుకోవాలి. లేదంటే వచ్చే శుక్రవారానికి ఒకరోజు ముందే అంటే వచ్చే గురువారం ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున అడవి శేష్ ఎవరు, శర్వానంద్ రణరంగం సినిమాలు విడుదలవుతున్నాయి. మరి శర్వా, అడవి శేష్ సినిమాలు రెండూ... రెండు స్పెషల్ జోనర్స్ తో తెరకెక్కిన సినిమాలు కావడంతో ప్రేక్షకుల్లో ఆ సినిమాల మీద మంచి ఆసక్తి ఉంది.
ఇక నాగార్జున మన్మథుడు 2 ఎంతగా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కేవలం ఆరు రోజులలోనే సైలెట్ గా సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. కాకపోతే నాగార్జునకి ఈ లాంగ్ వీకెండ్ బాగా కలిసొచ్చేలా ఉంది. వరసగా మూడు రోజుల సెలవులు మన్మథుడు 2 కి ఖచ్చితంగా కలిసొస్తుంది అనే ధీమాలో మన్మథుడు 2 టీం ఉంది.