Advertisementt

‘మేరాదోస్త్‌’ ఆడియో విడుదలైంది

Fri 09th Aug 2019 08:39 PM
celebrities,speech,mera dosth,movie,audio launch  ‘మేరాదోస్త్‌’ ఆడియో విడుదలైంది
Mera Dosth Movie Audio released ‘మేరాదోస్త్‌’ ఆడియో విడుదలైంది
Advertisement
Ads by CJ

వి.ఆర్‌.ఇంటర్నేషనల్‌ పతాకంపై పవన్‌, శైలజా హీరో హీరోయిన్లుగా జి.మురళి దర్శకత్వంలో పి.వీరారెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘మేరాదోస్త్‌’. వి.సాయిరెడ్డి సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణా వాటర్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ వి.ప్రకాశ్‌, డిజిక్వెస్ట్‌ బసిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్‌ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణా వాటర్‌బోర్డ్‌ ఛైర్మన్‌ వి.ప్రకాశ్‌ మాట్లాడుతూ...‘‘సినిమా అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తి. ఆరవ క్లాస్‌ నుంచే సినిమాలు  విపరీతంగా చూసేవాణ్ని. అంత ఆసక్తి ఉన్న నేను...  అనుకోకుండా పొలిటికల్‌ రంగంలోకి వెళ్లాను. ఆ తరువాత  అల్లాణి శ్రీధర్‌ గారి వద్ద  పలు  చిత్రాలకు దర్శకత్వశాఖలో పని చేశాను. ఆ తరుణంలోనే తెలంగాణా ఉద్యమం ప్రారంభమైంది. దీంతో సినిమాకు దూరమయ్యాను. ఇక ఎప్పటికైనా మంచి సినిమా తీయాలని ఉంది. ఇక ‘మేరాదోస్త్‌’ సినిమా విషయానికొస్తే.. వీరారెడ్డిగారు నాకు 20 ఏళ్లుగా పరిచయం. ఆయన సినిమా మీద  ప్యాషన్‌ తో వచ్చారు తప్ప డబ్బు సంపాదన కోసం మాత్రం కాదు. అలాగే దర్శకుడికి కూడా సినిమా రంగం పట్ల మంచి అవగాహన, అనుభవం ఉంది. పాటలు బావున్నాయి. ఈ సినిమా సక్సెస్‌ సాధించి పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్న’’ అన్నారు.

బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ...‘‘మురళీ నాకు చాలా కాలంగా పరిచయం. ప్రతిభావంతుడు. సినిమా రంగాన్ని నమ్ముకుని చాలా కాలము  ఉన్నాడు. ఈ సినిమా విజయం సాధించి తనకూ, ప్రొడ్యూసర్‌ కు మంచి పేరు తీసుకరావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

డిజిక్వెస్ట్‌ బసిరెడ్డి మాట్లాడుతూ...‘‘దర్శకుడు మురళీ కష్టపడే వ్యక్తి. ఈ సినిమాతో మంచి దర్శకుడుగా ఎదగాలి’’ అన్నారు.

సాయి వెంకట్‌ మాట్లాడుతూ...‘‘సినిమా పాటలు బావున్నాయి. నిర్మాత, దర్శకుడు ఇద్దరూ అభిరుచితో ఈ సినిమా తీశారు. వారికి ఈ సినిమా మంచి పేరు తేవాలన్నారు.

నిర్మాత పి.వీరారెడ్డి మాట్లాడుతూ...‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సినిమా రంగంలోకి అడుగుపెడూతూ ఈ సినిమాను నిర్మించాను. అందరికీ నచ్చే సినిమా అవుతుందన్న నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు.

దర్శకుడు జి.మురళి మాట్లాడుతూ...‘‘డైనమిక్‌లాంటి అమ్మాయి ఒక బలహీనుణ్ని ప్రేమిస్తుంది.  ఇలాంటి క్రమంలో ఆ అమ్మాయిని ఒక రాక్షసుడు ఎత్తుకెళ్తాడు. అప్పుడు ఆ బలహీనుడి మిత్రుడైన హీరో... ఆ రాక్షసుడ్ని సంహరించి... ఆ  అమ్మాయిని ఎలా రక్షించాడు అన్నది కథాంశం. మా నిర్మాత ఇచ్చిన సహకారంతో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించాం’’ అన్నారు. 

పవన్‌, శైలజా, కాశీనాథ్‌, బెనర్జి, అమిత్‌, వీరారెడ్డి, రాజాబాబు, జూ.రేలంగి, జగన్‌మోహన్‌రావు, సంధ్య, అనిత, రేఖావాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వి.సాయిరెడ్డి, ఎడిటర్‌: నందమూరి హరి, సినిమాటోగ్రఫీ: సుధీర్‌, లిరిక్స్‌: భాషాశ్రీ, నిర్మాత: పి.వీరారెడ్డి, దర్శకత్వం: జి.మురళి. 

Mera Dosth Movie Audio released:

Celebrities speech at Mera Dosth Movie Audio Launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ