Advertisementt

‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్‌లుక్‌, టీజర్‌ విడుదల

Fri 09th Aug 2019 07:30 PM
sarileru neekevvaru,mahesh babu,birthday special,first look,intro teaser  ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్‌లుక్‌, టీజర్‌ విడుదల
Sarileru Neekevvaru First Look and Intro Teaser Released ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్‌లుక్‌, టీజర్‌ విడుదల
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు పుట్టినరోజు కానుకగా ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్‌లుక్‌, టీజర్‌ 

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సూపర్‌స్టార్‌ మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్‌ 9న ఈ చిత్రం ఇంట్రో టీజర్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘సరిలేరు నీకెవ్వరు.. నువ్వెళ్ళే రహదారికి జోహారూ.. సరిలేరు నీకెవ్వరు.. ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు...’ అంటూ సాగే ఈ టీజర్‌లో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు సోల్జర్‌ గెటప్‌లో ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. దేవిశ్రీప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ఇంట్రో టీజర్‌, ఫస్ట్‌లుక్‌ను సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకి బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ విడుదల చేశారు. 

ఈ సినిమాకి సంబంధించిన కాశ్మీర్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షెడ్యూల్‌ జరుగుతోంది. 2020 సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి, ప్రకాష్ రాజ్ , రాజేంద్రప్రసాద్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ పనిచేస్తున్న సాంకేతిక వర్గం.

Click Hero for Teaser

Sarileru Neekevvaru First Look and Intro Teaser Released:

First Look, Teaser of ‘Sarileru Neekevvaru’ Released On The Occasion Of Superstar Mahesh’s Birthday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ