Advertisementt

మెగాస్టార్ కోసం కథ సిద్ధం చేస్తున్న యంగ్ డైరెక్టర్!

Fri 09th Aug 2019 06:46 PM
tollywood,megastar chiru,nag ashwin,mahanati  మెగాస్టార్ కోసం కథ సిద్ధం చేస్తున్న యంగ్ డైరెక్టర్!
Tollywood Young Director Makes A Story For Megastar Chiru మెగాస్టార్ కోసం కథ సిద్ధం చేస్తున్న యంగ్ డైరెక్టర్!
Advertisement
Ads by CJ

అవును మీరు వింటున్నది నిజమే.. యంగ్ డైరెక్టర్, ‘మహానటి’ సినిమాతో తన పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగేలా చేసుకున్న నాగ్‌అశ్విన్‌.. మెగాస్టార్ చిరంజీవి కోసం కథ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై స్వయంగా ఓ భారీ ప్రాజెక్టును చేపట్టబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. అంతేకాదు ఈ యాత్ర సెప్టెంబర్‌లో ప్రారంభం కానుందని కూడా హింట్ ఇచ్చింది. ఈ చిత్రానికి గాను విజువల్‌ ఆర్టిస్టులు, డిజైనర్లు, రచయితలు కావాలని రిక్రూట్మెంట్ కూడా వదిలింది.

కాగా ఈ కథ ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని.. ఊహకందని రీతిలో సబ్జెక్ట్ ఉంటుందని సమాచారం. అయితే ఇలాంటి వార్తలు అస్తమానూ టాలీవుడ్‌లో హల్ చల్ చేస్తుండటంతో మెగాభిమానులు సంబరపడిపోతున్నారు. ఈ వ్యవహారంపై ఇంతవరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. సో.. ఇప్పటి వరకూ భారీ ప్రాజెక్ట్ అని మాత్రం తెలిసింది.. గనుక ఇక నటీనటులు ఎవరన్న విషయం త్వరలోనే తేలిపోనుంది.

మరోవైపు ఈ మొత్తం వ్యవహారం చిరు కోసమేనని ఫిల్మ్‌నగర్‌లో పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాగా.. చిరంజీవి, మహానటి దర్శక-నిర్మాతలకు మంచి అనుబంధముందన్న విషయం విదితమే. మహానటి సక్సెస్ అయిన తర్వాత చిరు వీరందర్నీ సత్కరించిరించారు కూడా. మరోవైపు అశ్వనీదత్‌తో చిరుకు మంచి సన్నిహిత సబంధం ఉంది. అయితే ఈ భారీ ప్రాజెక్టు మెగాస్టార్ కోసమో లేకుంటే మరొకరి కోసమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Tollywood Young Director Makes A Story For Megastar Chiru :

Tollywood Young Director Makes A Story For Megastar Chiru   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ