Advertisementt

2024లోనూ పవన్ కష్టమే.. ఎన్టీఆర్‌కు ఛాన్స్!

Fri 09th Aug 2019 06:43 PM
astrologer venu swamy,jr ntr,janasena,pawan  2024లోనూ పవన్ కష్టమే.. ఎన్టీఆర్‌కు ఛాన్స్!
Famous astrologer venu swamy predicted Jr Ntr and Janasena Chief Pawan 2024లోనూ పవన్ కష్టమే.. ఎన్టీఆర్‌కు ఛాన్స్!
Advertisement
Ads by CJ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024లో పెనుమార్పులు సంభవిస్తాయని.. ఈ ఎన్నికలు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పెద్దగా అచ్చిరావని.. జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ అవ్వొచ్చని ప్రముఖ జ్యోతిష్కుడు, సంఖ్యా శాస్త్రవేత్త వేణు స్వామి చెప్పుకొచ్చారు. జూనియర్ జాతకచక్రంలో ఉన్న గ్రహస్థితి వల్ల అతను రాజకీయాల్లోకి వస్తే అద్భుతాలు సృష్టిస్తాడని..  జోస్యం చెప్పారు. అంతటితో ఆగని ఆయన.. తాను ఎన్టీఆర్ సినిమాల్లోకి వస్తే బాగుంటుందని స్వామి ఆకాంక్షించారు.

పవన్‌ గురించి మాట్లాడిన ఆయన.. జనసేనానికి అధికార యోగం లేదని గతంలోనే తాను చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. అయితే.. 2019తో పోలిస్తే.. 2024లో మాత్రం పవన్‌కు కొంత వరకు మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. ఇక జూనియర్ ఎన్‌టీఆర్ తన తాతలా ఒక కొత్త పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళితే ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయమని వేణు స్వామి జోస్యం చెప్పారు.

అయితే.. ఈ వార్త విన్న ఎన్టీఆర్ అభిమానులు ఎగిరి గంతేస్తుండగా.. పవన్ వీరాభిమానులు మాత్రం స్వామిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి వేణు స్వామీ అంతా తమరు చెప్పినట్లే జరుగుతుందా ఏంటి..? అది కూడా చూద్దామని జనసైనికులు అంటున్నారు. మరి ఈ విషయం పవన్-ఎన్టీఆర్‌ల దాకా వెళ్తే పరిస్థితి ఏలా ఉంటుందో..!

Famous astrologer venu swamy predicted Jr Ntr and Janasena Chief Pawan:

Famous astrologer venu swamy predicted Jr Ntr and Janasena Chief Pawan  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ