Advertisementt

అనసూయ బిగ్‌బాస్‌‌ను ఎందుకు వదులుకుందంటే...

Fri 09th Aug 2019 06:26 PM
anchor anasuya,reject,bigg boss,kathanam  అనసూయ బిగ్‌బాస్‌‌ను ఎందుకు వదులుకుందంటే...
Anchor Anasuya rejects Bigg Boss.. Here Why... అనసూయ బిగ్‌బాస్‌‌ను ఎందుకు వదులుకుందంటే...
Advertisement
Ads by CJ

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 కంటెస్టెంట్‌గా రావాలని తనకు ఆఫర్ వచ్చిందని.. అయితే తనకు షోకి రావడం ఇష్టం లేదని చెప్పుకొచ్చింది హాట్ యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్. ఈ భామ నటించిన ‘కథనం’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో భాగంగా బిగ్ బాస్ ప్రస్తావన వచ్చింది. అసలు తాను ఎందుకు వద్దనుకుంది..? అసలు కారణాలేంటి..? అనే విషయాలన్ని చెప్పుకొచ్చింది.

‘నేను బిగ్‌బాస్ షోను అప్పుడప్పుడు చూస్తుంటాను. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న వాళ్లంతా నాకు బాగా పరిచయమున్న వాళ్లే. బిగ్ బాస్ నుంచి నాకు కూడా ఆఫర్ వచ్చింది. కానీ నేను సున్నితంగా తిరస్కరించాను. ఎందుకంటే నేను నా ఫ్యామిలీని వదిలిపెట్టి ఎక్కువ రోజులు ఉండలేను. ఫ్యామిలీని వదిలి అన్నేసి రోజులు దూరంగా ఉండటానికి ఎంతో ధైర్యం కావాలి. అంత ధైర్యాన్ని నేను చేయలేను. షూటింగుకి బయటికి వెళితేనే రెండు మూడు సార్లు వీడియో కాల్ చేస్తాను. బిగ్ బాస్‌హౌస్‌లోకి వెళితే ఆ అవకాశం ఉండదు. అందుకే వాళ్లు అడిగినా వెళ్లలేదు’ అని అనసూయ చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు అందరికీ అనసూయ శుభాకాంక్షలు తెలుపింది. కాగా ‘కథనం’ చిత్రం ఆగస్ట్ 9న విడుదల కాబోతోంది. మరో వైపు అక్కినేని నాగ్, రకుల్ ప్రీత్ సింగ్ నటీనటులుగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం ‘మన్మథుడు-2’ కూడా నేడు విడుదల కానుంది. ఈ రెండింటిలో ఏ చిత్రం గట్టెక్కుతుందో వేచి చూడాలి మరి.

Anchor Anasuya rejects Bigg Boss.. Here Why...:

Anchor Anasuya rejects Bigg Boss.. Here Why...  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ