Advertisementt

‘సరిలేరు నీకెవ్వరు’కు డేట్స్ ఇచ్చేసిన రాములమ్మ!

Fri 09th Aug 2019 03:19 PM
vijayashanthi,dates,sarileru neekevvaru!,mahesh babu,shooting  ‘సరిలేరు నీకెవ్వరు’కు డేట్స్ ఇచ్చేసిన రాములమ్మ!
Vijayashanthi Gives Dates For Sarileru neekevvaru! ‘సరిలేరు నీకెవ్వరు’కు డేట్స్ ఇచ్చేసిన రాములమ్మ!
Advertisement
Ads by CJ

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, రష్మికా మందన్నా నటీనటులుగా స‌క్సెస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘స‌రిలేరు నీకెవ్వరు’. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది. కాగా ఈ మూవీతో సీనియర్ నటి, లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి అలియాస్ రాములమ్మ రీ ఎంట్రీ ఇస్తున్నారు. దాదాపు పదమూడేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ స్క్రీన్‌ మీద కనిపించేందుకు రాములక్క సిద్దమయ్యారు.

కాగా.. ‘స‌రిలేరు నీకెవ్వరు’ చిత్రం కోసం విజ‌య‌శాంతి చాలా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిసింది. మొత్తం సుమారు 55 రోజులుపాటు దర్శకనిర్మాతలకు డేట్స్ ఇచ్చిన‌ట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆగ‌స్ట్ 9న అనగా మహేశ్ బాబు పుట్టిన రో జే ఆమె సెట్‌లోకి అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాను ఈ చిత్రంలో కీల‌క పాత్రలో పోషిస్తున్నట్టు ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 

అయితే.. రాములమ్మ పాత్ర నెటిగిటివ్‌గా ఉంటుందా..? లేదా పాజిటివ్‌గా ఉంటుందా..? రీ ఎంట్రీతో సక్సెస్ అవుతారా..? లేదా అని నాటి విజయశాంతి అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. విజయశాంతి రీ ఎంట్రీతో హిట్టయ్యిందా లేదా అనేది తెలియాలంటే సంక్రాంతి దాకా వేచి చూడాల్సిందే మరి.

Vijayashanthi Gives Dates For Sarileru neekevvaru!:

Vijayashanthi Gives Dates For Sarileru neekevvaru!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ