మన సంప్రదాయాలకు అతీతంగా ఉండే లివింగ్ రిలేషన్ షిప్ గత కొంత కాలం నుండి అన్ని ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. ఒకప్పుడు లివింగ్ రిలేషన్ షిప్ అంటే ఏంటిది అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అది కామన్ అయిపోయింది. బాలీవుడ్ నుండి అన్ని వుడ్స్ కి పాకిన ఈ లివింగ్ రిలేషన్ పై తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తనదైన శైలిలో స్పందించింది.
ప్రస్తుతం ఈమె నటించిన మన్మథుడు 2 ప్రమోషన్స్ లో ఉన్న రకుల్ కి లివింగ్ రిలేషన్ షిప్ పై మీ కామెంట్ ఏంటి అని అడగ్గా తనకి లివింగ్ రిలేషన్ షిప్ అంటే అస్సలు పడదని - పెళ్లి మీద తనకి రెస్పెక్ట్ ఉందని దాన్ని గౌరవిస్తానని చెప్పుకొచ్చింది. ఈమె మాటలు చూస్తుంటే ఇప్పుడున్న హీరోయిన్స్ లో ఇటువంటి వారు కూడా ఉన్నారా? అని అనిపిస్తుంది.
ప్రస్తుతం ఈమె నితిన్ సినిమాతో పాటు శంకర్ ఇండియన్ 2 లో సిద్దార్థ్ సరసన హీరోయిన్ గా నటించనుంది. అలానే హిందీలో ఓ సినిమా చేయనుంది. ఈ మూడు సినిమాలు తప్ప ఆమె చేతిలో ఏమి లేవు.