తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవితం ఆధారంగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించారు. ఇక దీన్ని తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్‌తో తెరకెక్కించనున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే ఈ బయోపిక్ లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది.
ఈ బయోపిక్ లో మరో కీలక పాత్ర ఎం.జి.రామచంద్రన్‌గా అరవింద్ స్వామి నటించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. కంగనాను అచ్చం అమ్మలా మార్చేందుకు హాలీవుడ్ నుంచి స్పెషల్ మేకప్ టీమ్ ఇండియాకు రానున్నారు. ఇక ఈసినిమాకి వంద కోట్లు బడ్జెట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. కంగనాకు బాలీవుడ్ లో ఎలాగూ మంచి మార్కెట్ ఉంది కాబట్టి అక్కడ ఈమూవీని భారీగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
అమ్మ బయోపిక్ కాబట్టి తమిళంలో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తెలుగు, కన్నడ, మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఒక స్టేట్ సీఎం మీద సినిమా కాబట్టి కచ్చితంగా ఈ సినిమా ఈజీగా రికవరీ అవుతాయని చిత్రబృందం భావిస్తోంది. ఈసినిమా కోసం కంగనా తమిళం కూడా నేర్చుకోనుంది. ఇక షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో త్వరలోనే ప్రకటించనున్నారు.