నాని.. డైరెక్టర్‌గా అవుదామని టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి నేచురల్ స్టార్ అయ్యి హీరోగా రాణిస్తున్నాడు. ఇందుకు కర్త, కర్మ, క్రియ ఎవరంటే డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్‌కృష్ణ. తొలి సినిమాతోనే నానిని ఎక్కడికో తీసుకెళ్లాడు ఇంద్రగంటి. రెండో సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు తాజాగా ‘వి’ చిత్రంతో వచ్చేస్తున్నాడు. అంటే ముచ్చటగా మూడో సినిమా అన్న మాట. అయితే ఇప్పటికి భిన్న కథలు ఎంచుకుని హిట్టయిన నాని.. ‘వి’లో ఎలాంటి పాత్ర ఉండబోతోంది..? ఆయన లుక్ ఎలా ఉండబోతోంది..? అని నేచురల్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో నాని ఎవరూ ఊహించని లుక్‌లో అభిమానుల ముందుకు వచ్చేస్తున్నాడని ఇంద్రగంటి కాస్త హింట్ ఇచ్చారట. ఇప్పటి వరకూ టాలీవుడ్‌లో సీనియర్లు, జూనియర్లు ఎంతో మంది ‘సిక్స్ ప్యాక్’లో కనిపించి అభిమానులను ఫిదా చేసిన విషయం తెలిసిందే. అయితే నాని ఇంత వరకూ సిక్స్ ప్యాక్ జోలికి వెళ్లలేదు. ఆ అవసరం నానికి ఇంతవరకూ రాలేదు. కానీ ఈ ‘వి’ చిత్రంలో సిక్స్‌ప్యాక్‌లో కనిపించి అటు ఇంద్రగంటి.. ఇటు అభిమానుల ముచ్చట తీర్చనున్నాడట నాని.
మొత్తానికి చూస్తే.. ఇక ‘వి’లో విలనిజం చూపించేందుకు సిద్ధమవుతున్నాడన్న మాట.!. ఈ సిక్స్‌ప్యాక్‌కు సంబంధించిన వార్త ఫిల్మ్‌నగర్‌లో ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో..? తెలియాలంటే డైరెక్టర్ ఇంద్రగంటి కానీ.. నేచురల్ స్టార్ కానీ రియాక్ట్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందేనన్న మాట.