Advertisementt

‘సాహో’ కోసం శ్రద్ధా గట్టిగానే తీసుకుందిగా!!

Wed 07th Aug 2019 10:23 PM
shraddha kapoor,remuneration,saaho,prabhas   ‘సాహో’ కోసం శ్రద్ధా గట్టిగానే తీసుకుందిగా!!
Shraddha Kapoor Shocking Remuneration For Saaho ‘సాహో’ కోసం శ్రద్ధా గట్టిగానే తీసుకుందిగా!!
Advertisement
Ads by CJ

‘బాహుబలి’ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ మరో భారీ సినిమా ‘సాహో’తో అభిమానుల ముందకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ అందాల భామ శ్రద్ధా కపూర్ నటించింది. దాదాపు రూ. 300 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 30న థియేటర్లలోకి రానుంది. ఇంత పెద్ద మొత్తంతో నిర్మించిన ఈ సినిమాలో నటించిన నటీనటులుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకోంటరబ్బా అనేది గత కొన్నిరోజులుగా ఇటు టాలీవుడ్‌లో.. అటు బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. 

ఇప్పటికే ప్రభాస్‌ రెమ్యునరేషన్‌కు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వచ్చిన విషయం విదితమే. తాజాగా.. శ్రద్దా రెమ్యునరేషన్‌పై గట్టిగానే వస్తున్నాయి. ప్రభాస్ సరసన నటించేందుకు శ్రద్ధా గట్టిగానే తీసుకుందని.. తెలుగులో తొలి సినిమాకు ఈ రేంజ్‌లో తీసుకుందా..? అని సినీ ప్రియులు చెవులు కొరుకుంటున్నారట. ఈ బాలీవుడ్ భామ ఒకట్రెండు కాదు ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుందని టాలీ, బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.

కాగా.. ఇప్పటి వరకూ బాలీవుడ్ భామలు ఎంతో మంది టాలీవుడ్‌కు వచ్చి అందచందాలను ఆరబోసినప్పటికీ ఈ రేంజ్‌లో పుచ్చుకోలేదట. అంతేకాదు.. కాజల్, తమన్నా, త్రిష లాంటి సీనియర్ నాయికలు ఒక్కో సినిమాకు మహా అంటే ఒకటిన్నర నుంచి రెండు కోట్లు పారితోషికంగా మాత్రమే!. నయనతార మాత్రం సినిమాకి 4 కోట్లు అందుకుంటోంది. అయితే శ్రద్ధా ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకోవడంతో వామ్మో.. ఈ భామకు బాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ గట్టిగానే డిమాండ్ ఉందని నటీనటులు అనుకుంటున్నారట. ఇది ఎంత వరకు నిజమో మరి.

Shraddha Kapoor Shocking Remuneration For Saaho:

Shraddha Kapoor Shocking Remuneration For Saaho

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ