Advertisementt

చరణ్, ఉపాసనల ‘సైరా’ ప్లాన్ ఇదే..!

Wed 07th Aug 2019 07:48 PM
sye raa,chiranjeevi,bollywood promotions,ram charan,upasana,sye raa narasimha reddy,big b  చరణ్, ఉపాసనల ‘సైరా’ ప్లాన్ ఇదే..!
Sye Raa Movie Latest Update about Promotions చరణ్, ఉపాసనల ‘సైరా’ ప్లాన్ ఇదే..!
Advertisement
Ads by CJ

చిరంజీవి 151వ చిత్రం సై రా నరసింహారెడ్డి అక్టోబర్ 2న అని కన్ఫర్మ్‌గా సైరా టీం మాట్లాడడమే కానీ... ఎక్కడా ఆఫీషియల్ ప్రకటన లేదు. సినిమా విడుదలకు ఇంకా కేవలం రెండు నెలల టైం మాత్రమే ఉంది. అప్పుడెప్పుడో సై రా నరసింహారెడ్డి  చిరు లుక్, తమిళనటుడు విజయ్ సేతుపతి లుక్ తో పాటుగా అమితాబ్ లుక్స్ ని రివీల్ చేసింది టీం. కానీ చాలా కాలంగా సై రా కు సంబంధించిన అప్ డేట్ బయటికి రావడం లేదు. అదే బాలీవుడ్ లో ఓ సినిమాకి డేట్ ఇచ్చారంటే ఓ మూడు నెలలు ముందుగానే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయి. హీరో, హీరోయిన్స్ ఎక్కువగా అభిమానులకు, మీడియాకి బాగా దగ్గరగా ఉంటారు. కానీ సై రా సినిమాని నాలుగైదు భాషల్లో విడుదల చేస్తామని చెబుతున్నారు కానీ.. ప్రమోషన్స్ మాత్రం ఇంకా స్టార్ట్ చెయ్యలేదు. హిందీ‌లో అక్టోబర్ 2న విడుదలకాబోతున్న సినిమాలు ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశాయి.

అయితే చిరు సైరా సినిమా తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ ప్రమోషన్స్ గురించి టెన్షన్ పడకపోయినా.. హిందీ ప్రమోషన్స్ ని మాత్రం సై రా టీం కాస్త గట్టిగానే పట్టించుకుంటుందని అంటున్నారు. అయితే తాజాగా చిరు ఈ విషయాన్నీ సీరియస్‌గా తీసుకుని.. బాలీవుడ్ ప్రమోషన్స్ ని ఓ లెక్క ప్రకారం నిర్వహించడానికి ప్రిపేర్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. సై రా సినిమాలో ఓ స్పెషల్ రోల్ ప్లే చేసిన అమితాబచ్చన్ ని ప్రమోషన్స్ కోసం బాగా వాడుకోబోతున్నారట. 

అమితాబ్ నటించిన సీన్స్ తో సై రా టీజర్ కట్ చేసి.. హిందీలో స్పెషల్ గా వదలాలి అని అనుకోవడమే కాదు.... అమితాబ్ తో ప్రెస్ మీట్స్ గట్రా ప్లాన్ చేస్తున్నారట. ఇక రామ్ చరణ్, ఉపాసన తరుచూ బాలీవుడ్ స్టార్ హీరోలతో మీట్ అవుతున్నారు. కారణం అక్కడ స్పెషల్ గా పీఆర్ టీంని ఏర్పాటు చేసుకుని స్టార్ హీరోల మద్దతుతో తమ సై రా ప్రమోషన్స్ చేయాలని చరణ్, ఉపాసనలు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఆ ప్లాన్ మొత్తం రెడీ అయ్యిందని.... ఉపాసన ప్రత్యేకంగా సై రా బాలీవుడ్ ప్రమోషన్స్ మీద దృష్టిపెట్టినట్లుగా ఫిలింనగర్ టాక్.

Sye Raa Movie Latest Update about Promotions:

Ram Charan and Upasana planning to Sye Raa bollywood Promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ