Advertisementt

టాలీవుడ్ ప్రముఖ నటుడి భార్య ఆత్మహత్య

Wed 07th Aug 2019 07:38 PM
tollywood,artist madhu prakash,bharathi,suicide  టాలీవుడ్ ప్రముఖ నటుడి భార్య ఆత్మహత్య
Tollywood Artist wife commits suicide in Hyderabad టాలీవుడ్ ప్రముఖ నటుడి భార్య ఆత్మహత్య
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. క్షణికావేశంలో నటీనటులు, వారి కుటుంబీకులు తిరిగిరానిలోకాలకు వెళ్లిపోతున్నారు. కాస్త లోతుగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం మార్గం దొరుకుతుందని చేజేతులరా నిండు ప్రాణాలు నిలువునా తీసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ సీరియల్ నటుడు, బాహుబలి క్యారెక్టర్ ఆర్టిస్ట్ మధు ప్రకాష్ సతీమణి భారతి హైదరాబాద్‌లోని తన స్వగృహంలో ఆత్మహత్యకు పాల్పడింది. 

గత కొంత కాలంగా ఓ సీరియల్ నటితో మధు ప్రకాష్ చనువుగా ఉండటంతో కుటుంబంలో కలహాలు రేగాయి. ఇలా చేయడం సబబు కాదని పలుమార్లు ఆమె భర్తను ఆమె మందలించింది. కుటుంబ సభ్యులు, పోలీసుల దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లింది. అయినప్పటికీ భర్త మధు మారకపోవడంతో జీర్ణించుకోలేని భారతి బుధవారం నాడు బలవన్మరణానికి పాల్పడింది. కాగా.. ఆ సీరియల్ నటితో మధు అక్రమసంబంధం కూడా కొనసాగించినట్లు సమాచారం. 

భారతీ మృతిచెందినట్లు తెలుసుకున్న పలువురు సీరియల్ నటీనటులు, కుటుంబీకులు మధు ప్రకాష్ ఇంటికి చేరుకున్నారు. కాగా.. మధు ప్రకాష్ బాహుబలితో పాటు అనేక సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించాడు. ఇదిలా ఉంటే.. లండన్ నుంచి వచ్చి 2 ఏళ్ల క్రితం ఇండియా వచ్చిన భారతి.. మధుప్రకాశ్‌ని పెళ్లి చేసుకుంది. లైఫ్ సెటిల్ అయ్యింది.. మంచి భర్త దొరికాడనుకున్న భారతీ ఆనందం మూడ్నాల్లకే పరిమితమైంది. మధును కఠినంగా శిక్షించాలని భారతీ తల్లిదండ్రులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

Tollywood Artist wife commits suicide in Hyderabad:

Tollywood Artist wife commits suicide in Hyderabad

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ