రాజమౌళి డైరెక్షన్‌లో రామ్ చరణ్ - ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రం RRR. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తున్న సంగతి తెల్సిందే. అయితే రెండు రోజులు క్రితం జరిగిన స్నేహితుల రోజు సందర్భంగా అల్లూరి, కొమరం భీమ్ ఇద్దరు మంచి స్నేహితులు అని RRR టీం చెప్పింది.
కానీ వాస్తవం ఏంటంటే వీరిద్దరూ ఎప్పుడు కలుసుకున్నారు అనేది. అల్లూరి 1897లో జన్మించి, విశాఖ ప్రాంతానికి చెందిన అడవి జాతి ప్రజల హక్కుల కొరకు పోరాడి 1924లో ప్రాణాలు విడిచారు. మరి కొమరం భీమ్ ఏమో 1901లో జన్మించి హైదరాబాద్ నవాబు పాలనకు వ్యతిరేకంగా పోరాడి 1940లో మరణించడం జరిగింది.
ఈ లెక్కలు ప్రకారం చూస్తుంటే వీరిద్దరూ అసలు కలిసే అవకాశమే లేదు. అసలు వీరు కలిసినట్టు ఎక్కడా బలమైన ఆధారాలు లేవు. మరి అలాంటిది వీరిద్దరూ గొప్ప స్నేహితులు ఎలా అయ్యారు అనేదే ఆసక్తికరం.