ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్ లో RRR షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది చివరి వరకు ఈ చిత్ర షూటింగ్ జరగనుందని తెలుస్తుంది. మరి రాజమౌళి సినిమా తరువాత ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ తో చేస్తాడు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనేపధ్యంలో పలువురు టాప్ డైరెక్టర్స్ తో చర్చలు కూడా జరుపుతున్నట్టు టాక్ వచ్చింది. కొరటాలతో సినిమా చేస్తాడు అనుకున్నారు అంతా. కానీ కొరటాల చెప్పిన కథ కంటే లేటెస్ట్ గా త్రివిక్రమ్ చెప్పిన కథే ఎక్కువ నచ్చిందట.
అందుకే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కి ఓకే చెప్పినట్టు టాక్ వస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ బన్నీతో సినిమా చేస్తున్నాడు. ఇది కూడా ఈ ఏడాది చివరిలో అయిపోతుంది. ఆ తరువాత ఎన్టీఆర్ సినిమా కథపై కూర్చోనున్నాడు త్రివిక్రమ్. అన్ని కుదిరితే వచ్చే ఏడాది సమ్మర్ నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది. ఈ సినిమాని హారిక అండ్ హాసిని వారితో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించనున్నారు. కానీ ఎన్టీఆర్ మైత్రి మూవీస్ బ్యానర్ లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ సినిమా ఓకే చేసినట్టు.. అది 2020 స్టార్ట్ అవుతుందని ప్రొడ్యూసర్స్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. మరి త్రివిక్రమ్ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ తో ఆ సినిమా చేస్తాడేమో.