త్రివిక్రమ్ కి సునీల్ అంటే ఎంత ఇష్టమో మనకి తెలిసిన విషయమే. సునీల్ హీరోగా నిలదొక్కుకోలేక, మళ్లీ తనకు పేరు తెచ్చిన కామెడీ పాత్రలపైనే ఇంట్రెస్ట్ చూపుతూ అరవింద సమేతలో చేసాడు. త్రివిక్రమ్ కూడా సునీల్ కి ఈ సినిమాతో ముందుకు వెళ్తాడు అని భావించాడు. కానీ ఆ పాత్ర పెద్దగా క్లిక్ అవ్వలేదు. అందుకే సెకండ్ సినిమాతో అన్నా ఆ లోటు తీర్చుకుంద్దాం అని అతనికి బన్నీ సినిమాలో ఓ పాత్ర ఇచ్చాడు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో సునీల్ పాత్ర లేనట్టే అని వార్తలు వస్తున్నాయి.
బన్నీ - త్రివిక్రమ్ సినిమాతో తన కెరీర్ కి మంచి రోజులు వచ్చినట్టే అనుకున్నాడు సునీల్. కానీ ఏం చేస్తాం ఆ అవకాశం లేదు. బన్నీ సినిమాలో రావురమేష్ నటించాల్సి వుంది. ఆ పాత్రతో పాటు సునీల్ పాత్ర వుంటుందని తెలుస్తోంది. అయితే రావు రమేష్ తో డేట్స్ క్లాష్ రావడంతో అతని ప్లేస్ లో హర్ష వర్ధన్ ను తీసుకున్నారు. హర్ష వర్ధన్ ని ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడు పాత్రనే మార్చేసారని తెలుస్తోంది. దాంతో సునీల్ పాత్ర కూడా లేచిపోయిందని బోగట్టా.