సిద్ధార్థ, జీవీ ప్రకాష్ కాంబినేషన్ లో ‘బిచ్చగాడు’ ఫేమ్ శశి దర్శకత్వంలో అభిషేక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘ఎరుపు పసుపు పచ్చ’!
కథలో ఏదో కొత్తదనం ఉంటేగానీ, ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మితేగానీ సినిమాలకు సంతకం చేయరు హీరో సిద్ధార్థ, మ్యూజిక్ డైరక్టర్ కమ్ హీరో జీవీ ప్రకాష్. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారంటే, ఆ కథ ఎంత స్పెషల్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ తాజా చిత్రం పేరు ‘ఎరుపు పసుపు పచ్చ’. తమిళంలో ‘సివప్పు మంజల్ పచ్చై’ పేరుతో రూపొందుతోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది శశి. ఆయన పేరు చెప్పడంకన్నా ‘బిచ్చగాడు’ దర్శకుడు శశి అంటే వెంటనే అందరికీ
గుర్తుకొస్తారు. ‘బిచ్చగాడు’ తర్వాత స్ర్కిప్ట్ మీద బాగా వర్క్ చేసి ఆయన తెరకెక్కిస్తున్న చిత్రమిది. వీరందరి కాంబినేషనలో ‘ఎరుపు పసుపు పచ్చ’ను అభిషేక్ ఫిల్మ్స్ అత్యంత బ్రహ్మాండంగా నిర్మిస్తోంది. తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఫైనాన్షియర్‌గా వ్యవహరించి, తెలుగులో ‘శివలింగ’, ‘బ్లఫ్‌మాస్టర్’ వంటి హిట్ చిత్రాలను అందించిన రమేష్ పిళ్లై ‘ఎరుపు పసుపు పచ్చ’ను నిర్మిస్తున్నారు .
‘ఎరుపు పసుపు పచ్చ’ తాజా విశేషాలను నిర్మాత రమేష్ పిళ్లై వెల్లడిస్తూ... ‘‘ఒక ట్రాఫిక్ ఇనస్పెక్టర్‌కీ, ఒక బైక్ రేసర్‌కీ మధ్య సాగే ఎమోషనల్ వార్ చిత్రమిది. మంచి భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ డ్రామాగా రూపొందించాం. చిత్రీకరణ పూర్తయింది. ఎడిటింగ్, డబ్బింగ్ కూడా పూర్తి చేశాం. మిగిలిన పనులను శరవేగంగా చేస్తున్నాం. సెప్టెంబర్ ప్రథమార్ధంలో తమిళ్‌తో పాటు తెలుగు, హిందీలోనూ విడుదల చేస్తాం. ఏ ఒక్క భాషకో పరిమితమయ్యే కథ కాదు ఇది. అందరికీ కనెక్ట్ అవుతుంది. యూనివర్శల్ సబ్జెక్ట్. చూసిన ప్రతి వారూ తప్పకుండా కొత్తదనాన్ని ఆస్వాదిస్తారు. తెలుగులో నాకు హ్యాట్రిక్ చిత్రమవుతుంది’’ అని అన్నారు.
దర్శకుడు ‘బిచ్చగాడు’ ఫేమ్ శశి మాట్లాడుతూ... ‘‘నా గత చిత్రం ‘బిచ్చగాడు’తో తమిళనాడులోనే కాదు, తెలుగు ప్రజల మధ్య కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. ఆ కాన్సెప్ట్‌కు అంత మంచి ఆదరణ దక్కింది. ‘బిచ్చగాడు’ తర్వాత నా నుంచి ఓ సినిమా వస్తుందంటే... ప్రేక్షకులు ఏం ఆశిస్తారో నాకు తెలుసు. అందుకే వాళ్లందరినీ దృష్టిలో పెట్టుకుని నేను కథ సిద్ధం చేసుకున్నాను. పకడ్బంధీగా కథ తయారు చేసుకున్న తర్వాత మా హీరోలు సిద్ధార్థ, జీవీ ప్రకాష్‌ను కలిసి చెప్పాను. వారికి నచ్చి ప్రొసీడ్ అయ్యాం. వచ్చేనెల ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. మంచి భావోద్వేగాలున్న సబ్జెక్ట్ ఇది. అందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు.
నటీనటులు:
సిద్ధార్థ, జీవీ ప్రకాష్, కాశ్మీర పరదేశి, లిజిమోల్ జోస్, దీపా రామానుజం, మధుసూదనన, ప్రేమ్‌కుమార్, యశ్వంత్ తదితరులు
సాంకేతిక నిపుణులు;
నిర్మాత: రమేష్ పిళ్లై
కథ, స్క్రీన్ ప్లే , దర్శకత్వం: శశి
ఛాయాగ్రహణం: ప్రసన్నకుమార్
సంగీతం: సిద్ధుకుమార్
ఎడిటర్: శాన లోకేష్
ఆర్ట్: ఎస్.ఎస్.మూర్తి
స్టంట్: శక్తి శరవణన్