Advertisementt

‘పోలీస్ పటాస్’ ట్రైలర్ వదిలారు

Mon 05th Aug 2019 09:22 PM
c kalyan,police pattas,movie,trailer,launche  ‘పోలీస్ పటాస్’ ట్రైలర్ వదిలారు
Police Pattas Movie Trailer Launched ‘పోలీస్ పటాస్’ ట్రైలర్ వదిలారు
Advertisement
Ads by CJ

పోలీస్ పటాస్ గొప్ప సినిమా అవుతుంది - నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ

భీమవరం టాకీస్ 97వ సినిమా పోలీస్ పటాస్ ప్రమోషనల్ ట్రైలర్ ఈరోజు (సోమవారం) నిర్మాత సి.కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల కావడం జరిగింది. 

ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ... నా శిష్యుడు రామసత్యనారాయణ ఇది 97వ సినిమా అంటున్నాడు. కానీ నాకు తెలిసి అతను తన 100వ సినిమాను శతాధిక దర్శకుడితో ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమా చేసే వరకు తాను 97, 98వ సినిమా చేస్తున్నానని అంటాడు. ఏదీ ఏమైనా తాను నిర్మించబోయే అన్నీ సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.

నిర్మాత రామసత్యనారాయణ గారు మాట్లాడుతూ.. నేను సినిమాలు తియ్యడం నేర్చుకుంది సి.కళ్యాణ్ గారి దగ్గరే, పోలీస్ పటాస్ సినిమా అయేషా చక్కగా నటించింది. ఈ సినిమా తరువాత ఆమెకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడుతుంది.  విజయశాంతి తరువాత అంత గొప్ప పేరు సంపాదించుకుంటుంది ఈ అమ్మాయి. పోలీస్ పటాస్ అందరికి నచ్చే గొప్ప సినిమా అవుతుంది అన్నారు. 

సుధీష్ గారు మాట్లాడుతూ... ఒక్క సినిమా ప్లాప్ అయితే నిర్మాతలు కనుమరుగవుతారు, కానీ నిర్మాత రామసత్యనారాయణ గారు క్వాలీటితో కూడిన ఇన్ని సినిమాలు వరుసగా అందిస్తూ చక్కటి చిరునవ్వుతో ఉన్నారు చాలా సంతోషం అన్నారు.

మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ... కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన అయేషా ఈ సినిమాలో నటించడం విశేషం. రామసత్యనారాయణ మంచి చిత్రాలు నిర్మిస్తూ చిన్న నిర్మాతలకు రోల్ మెడల్‌గా ఉన్నారు అన్నారు.

నటీనటులు:

అయేషా, రవికాలే, నిరంజన్ తదితరులు

సాంకేతిక నిపుణులు:

సంగీతం: శ్రీ వాస్తవ్

కథ: నాగేశ్వర రావు

పి.ఆర్.ఓ: వీసా మధు

సాహిత్యం: బాల త్రిపుర సుందరి

నిర్మాత: రామసత్యనారాయణ

Police Pattas Movie Trailer Launched:

C Kalyan Launches Police Pattas Movie Trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ