Advertisementt

రంగంలోకి దిగిన బండ్ల గణేష్..

Mon 05th Aug 2019 07:55 PM
ganesh bandla,silver screen
,sarileru neekevvaru,mahesh babu   రంగంలోకి దిగిన బండ్ల గణేష్..
Ganesh Bandla returns to silver screen రంగంలోకి దిగిన బండ్ల గణేష్..
Advertisement
Ads by CJ

కెరియర్ ఆరంభంలో కమెడియన్‌గా చిన్న చిన్న పాత్రలు చేసిన బండ్ల గణేశ్, ఆ తర్వాత నిర్మాతగా మారిపోయి పెద్ద పెద్ద సినిమాలు తీసిన విషయం విదితమే. కమెడియన్, నిర్మాతగా విజయవంతమైన బండ్ల.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే పాలిటిక్స్‌లోకి దిగిన ఆయన.. పట్టుమని పదిరోజులు కూడా ఉండలేకపోయారు. అప్పటి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కండువా కప్పుకున్న గణేష్.. రాజకీయాల గురించి లోతుగా తెలుసుకున్నాక.. గుడ్ బై చెప్పేసి బయటికొచ్చేశారు.

అయితే.. సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’తో మళ్లీ బండ్ల గణేష్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో మొదలుపెట్టింది. తాజాగా ఈ సినిమా షూటింగులో బండ్ల జాయిన్ అయ్యాడు. అయితే బండ్లకు ఈ సినిమాలో మంచి పాత్ర ఉందని.. ప్రత్యేకంగా తనకోసం దగ్గరుండి మరీ కథ రాయించుకున్నాడని సమాచారం.

మరో విశేషం ఏమిటంటే.. బండ్లతో పాటు.. విజయశాంతి అలియాస్ రాములక్క కూడా ఇదే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. మహేశ్ బాబు ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించే ఈ సినిమాలో ఆయన జోడీగా రష్మిక మందన నటిస్తున్న విషయం విదితమే.

Ganesh Bandla returns to silver screen:

Ganesh Bandla returns to silver screen  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ