Advertisementt

సూపర్ హిట్ టాక్.. కానీ కలెక్షన్లే..!

Mon 05th Aug 2019 07:29 PM
rakshasudu,bellamkonda sai srinivas,collections,hit talk,anupama parameswaran,rakshasudu movie  సూపర్ హిట్ టాక్.. కానీ కలెక్షన్లే..!
Rakshasudu Movie Gets Hit Talk.. But No Collections సూపర్ హిట్ టాక్.. కానీ కలెక్షన్లే..!
Advertisement
Ads by CJ

కెరీర్‌లో మొట్టమొదటిసారిగా సూపర్ హిట్ అందుకున్నాడు మన బెల్లంకొండ బాబు సాయి శ్రీనివాస్. భారీ బడ్జెట్‌తో భారీ డైరెక్టర్స్‌తో సినిమాలు చేసిన రాని హిట్ట్టు.. ఒకే ఒక్క రీమేక్ చేస్తే వచ్చేసింది. తమిళ సినిమాని తెలుగులో రాక్షసుడుగా రీమేక్ చేసి హిట్ కొట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ కూడా రాబట్టింది. ఇక శని ఆది వారాల్లోనూ రాక్షసుడు కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. అంటే మరీ అంత సూపర్ కాకపోయినా... థియేటర్స్ ఆక్యుపెన్సీ బాగానే ఉంది. కాకపోతే వరసగా కురుస్తున్న వర్షాలు బెల్లంకొండ ఆనందాన్ని ఆవిరి చేసేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరసగా నాలుగురోజుల నుండి పట్టిన ముసురుకి.. ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లి సినిమా చూసేంత సీన్ కనబడడం లేదు.

మరి వీకెండ్‌లో పర్వాలేదనిపించినా... రాక్షసుడు వీక్ డేస్ మొదలయ్యాక వీకవడం ఖాయమంటున్నారు. పాపం హిట్టయిన ఆనందంలో బెల్లంకొండ తెగ సంతోష పడిపోతున్నాడు కానీ.. సినిమాకి థియేట్రికల్ రైట్స్‌తో వచ్చిన 13.50 కోట్లు రావడం కష్టమంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి హిట్ అని సంబరపడిపోతున్న రాక్షసుడు టీం కి ఇది కాస్త బాధకలిగించే విషయమే. సినిమాకి మంచి మార్కులు వేసిన ప్రేక్షకులు ఇలాంటి ప్రతికూల వాతావరణంలో మళ్ళీ మళ్ళీ సినిమా చూసేందుకు సిద్దపడరు. ఇక ఈ వారంలో రాక్షసుడు బ్రేక్ ఈవెన్ సాధించాల్సిన పరిస్థితి. ఎందుకంటే వచ్చే శుక్రవారం మన్మథుడు 2తో నాగార్జున థియేటర్స్‌ని ఆక్యుపై చేస్తాడు. ఈలోపే రాక్షసుడు గట్టిగా కొట్టాలి.. లేదంటే హిట్ అయినా వేస్ట్.

Rakshasudu Movie Gets Hit Talk.. But No Collections:

Rain Effect on Bellamkonda Srinivas Rakshasudu Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ