Advertisementt

బాహుబలి రూట్‌లో వెళుతున్న సైరా!

Mon 05th Aug 2019 04:16 PM
sye raa,movie,latest,update  బాహుబలి రూట్‌లో వెళుతున్న సైరా!
Sye Raa Follows Bahubali బాహుబలి రూట్‌లో వెళుతున్న సైరా!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘సైరా-నరసింహారెడ్డి’ అన్ని కుదిరితే అక్టోబర్ 2 న రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కి ఇంకా టైం పట్టేలా ఉంది కాబట్టి సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశముందని టాక్ వస్తుంది. అక్టోబర్ 2 కాకపోతే మళ్లీ సంక్రాంతికే అని రూమర్స్ బాగా వైరల్ అవుతున్నాయి. కానీ సైరా టీం మాత్రం ఇవేవి పట్టించుకోకుండా సైరాను అక్టోబర్ 2 నే రిలీజ్ చేయాలనీ, అందుకు సంబంధించి వర్క్ త్వరగా ఫినిష్ చేయాలనీ చూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసింది.  డే అండ్ నైట్ ఖాళీ లేకుండా వర్క్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు టీం. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ వర్క్ అనేది చాలా కాంప్లికేషన్‌తో కూడుకున్నది కాబట్టి అందుకు ఎంతో అడ్వాన్స్ ప్లాన్‌ని డిజైన్ చేశారు. అందుకే బాహుబలిని ఫాలో అవుతున్నారు సైరా టీం. ఒకేసారి మొత్తం ప్రపంచ దేశాల్లోని 26 స్టూడియోల్లో వీఎఫ్‌ఎక్స్ సహా కీలకమైన పనులన్నీ జరుగుతున్నాయి. ఇండియాతో పాటు రష్యా-ఇరాన్- అమెరికా-  ఈజిప్ట్ వంటి చోట్ల వీఎఫ్‌ఎక్స్ స్టూడియోల్లో వర్క్ జరుగుతోంది.

అందుకే టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అక్టోబర్ 2 న ఈ మూవీ రిలీజ్ అవుతుందని... పైగా రామ్ చరణ్ ఎక్కడ కాంప్రమైజ్ కావడంలేదట. త్వరలోనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయనున్నారు.

Sye Raa Follows Bahubali:

Sye Raa Movie Latest Update