Advertisementt

కొబ్బరిమట్టను ఆ దర్శకుడికి అంకితం ఇచ్చారు

Mon 05th Aug 2019 04:00 PM
sampoornesh babu,kobbari matta,dedicated,evv satyanarayana  కొబ్బరిమట్టను ఆ దర్శకుడికి అంకితం ఇచ్చారు
Kobbari Matta Dedicated To EVV Satyanarayana కొబ్బరిమట్టను ఆ దర్శకుడికి అంకితం ఇచ్చారు
Advertisement
Ads by CJ

ఇ.వి.వి సత్యనారాయణ గారికి... బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ‘కొబ్బ‌రిమ‌ట్ట’ చిత్రం అంకితం

నవతరం హాస్యానికి పట్టం కట్టిన దివంగత దర్శకుడు ఇవివి సత్యనారాయణకు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన కొబ్బరిమట్ట చిత్రాన్ని అంకితమిస్తున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. 

హృద‌య‌కాలేయం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో నిలిచిన సంపూర్ణేష్ బాబు ఇందులో త్రిపాత్రాభిన‌యంలో కనిపించనున్నారు.  హృద‌య‌కాలేయం సృష్టిక‌ర్త స్టీవెన్ శంక‌ర్ అందించిన క‌థ‌, క‌థ‌నం, మాట‌లతో కొబ్బ‌రిమ‌ట్ట అనే చిత్రాన్ని రూపొందించారు. రూప‌క్ రొనాల్డ్ స‌న్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నారు. సున్నిత‌మైన క‌థ‌ల‌తో చిత్రాలు నిర్మించి  ప్రేక్ష‌కులకి గిల్లిక‌జ్జాలు పెట్టే సాయి రాజేష్ నిర్మాత‌గా ఈ సినిమా రూపొందించారు. ఇక ఈ చిత్రం ట్రైలర్ రికార్డులు సృష్టిస్తోంది. ఈ నాన్ స్టాప్ ట్రైలర్ పై వస్తున్న కామెంట్స్, స్పందన అద్భుతంగా ఉందని చిత్రం యూనిట్ చెబుతోంది. 

ఈ చిత్రంలో బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మూడు పాత్ర‌లు వేయ‌ట‌మే కాకుండా అత్యంత భారీ డైలాగ్స్ చెప్పి లిమ్కా బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డుని నెల‌కొల్పాడు.. ఈ చిత్రంలో పాపారాయుడు, పెద‌రాయుడు, ఆండ్రాయుడు  లాంటి అత్య‌ద్బుత‌మైన‌ పాత్ర‌లు చేసి మెప్పించ‌బోతున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో టాలీవుడ్ కి చెందిన ప్రముఖ న‌టీన‌టులంద‌రూ న‌టించారు. ఈ భారీ చిత్రాన్ని అగ‌ష్టు 10 న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు భారీగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌టంలో ఎక్క‌డా బారియ‌ర్స్ లేని ఇంత‌టి క్రేజీ చిత్రాన్ని నైజాం, ఓవ‌ర్‌సీస్ హ‌క్కుల‌ని నొబారియ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారు సొంతం చేసుకున్నారు. 120 నిమిషాల ఈ చిత్రంలో యాక్ష‌న్‌, కామెడీ, సెంటిమెంట్‌, రొమాన్స్‌, సందేశం, ఎమోష‌న్‌, ల‌వ్ లాంటి అన్ని జోనర్స్ క‌ల‌యికే ఈ కొబ్బ‌రిమ‌ట్ట‌. అందుకే ఈ చిత్రాన్ని దివంగత దర్శకుడు ఇవివి గారికి అంకితం ఇస్తున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా అమృత  ప్రొడక్షన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. 

‘‘కొత్త తరం హాస్యానికి ఆద్యులు మీరు

కొత్త తరం దర్శకులకి విలువ తెచ్చిన మహనీయులు మీరు

మీరు లేని లోటు... మీ చిత్రాలు తీరుస్తూనే ఉన్నాయి....

మీరు లేరన్న విషయం గుర్తు చేస్తూనే ఉన్నాయి....

మీ మార్క్ హాస్యం కోసం ప్రయత్నిస్తూ... ఈ చిత్రం అంకితం ఇస్తున్నాము’’. అని అన్నారు.

Kobbari Matta Dedicated To EVV Satyanarayana:

Kobbari Matta Team Takes Sensational Decision

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ