Advertisementt

ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్: RRR ట్రీట్ అదిరింది

Mon 05th Aug 2019 11:36 AM
ram charan,jr ntr,friendship,photos,social media,rrr movie  ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్: RRR ట్రీట్ అదిరింది
Superb Treat to RRR Fans on the Occasion Of Friendship Day ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్: RRR ట్రీట్ అదిరింది
Advertisement
Ads by CJ

రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి బడా మల్టీస్టారర్ RRR ని తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఒకే సినిమాలో నటించడం అంటేనే అది పెద్ద సెన్సేషన్. విడివిడిగా బోలెడంత స్టార్ డమ్ ని సొంతం చేసుకున్న ఈ స్టార్ హీరోస్ ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపిస్తున్నారనగానే ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు ఒకటే సంతోషం. తమ అభిమాన హీరోలిద్దరి స్క్రీన్ షేర్ చేసుకోవడం అందులోను రాజమౌళి దర్శకత్వంలో నటించడం అంటే ఏ అభిమానులకైనా పండగ లాంటిదే. కొమరం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లు RRR సినిమాలోని పాత్రల్లో కనిపిస్తున్నారు. మరి RRR ఫస్ట్ లుక్ లో చరణ్ ఫేస్, ఎన్టీఆర్ ఫేస్ లను మాత్రమే చూపిస్తూ సస్పెన్స్ లో పెట్టిన రాజమౌళి తమ హీరోల సపరేట్ లుక్స్ ఎప్పుడెప్పుడు చూపిస్తాడా అని తెగ ఎదురు చూస్తున్నారు. ఇక స్వతహాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లు బయట కూడా ఫ్రెండ్స్ కావడంతో లొకేషన్ లో ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారని చిత్ర బృందం చెబుతుంది. మహేష్, చరణ్, ఎన్టీఆర్ లాంటి వారు బయట కూడా మంచి ఫ్రెండ్స్.

ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ RRR లొకేషన్స్ లో ఎలా ఉంటున్నారో తెలియదు కానీ... ఇప్పుడు ఆగష్టు 4 న ఫ్రెండ్షిప్ డే రోజున ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి ఫొటోస్ కి ఫోజులిచ్చారు.. చూడండి అబ్బా అభిమానులు ఇది చాలు కదా మనకి అన్నట్టుగా ఉన్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హగ్ చేసుకుని... ఎన్టీఆర్ ని రామ్ చరణ్ గట్టిగా పట్టుకుంటే... ఆ ఫోటో చూపరులకు కాదు... అభిమానులకు చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు. 

ఇక చరణ్ ని హగ్ చేసుకున్న ఎన్టీఆర్ విజిల్ వేస్తూ ఫుల్ హ్యాపీ ఫేస్ తో ఉన్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్, చరణ్ ల స్నేహబంధాన్ని చూసిన అభిమానులు మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అనుకోకుండా ఫుల్ గా ఈ పిక్స్ చూసి ఎంజాయ్ చేస్తూ మారితే బావుంటుంది.

Superb Treat to RRR Fans on the Occasion Of Friendship Day:

RRR team Poster Ram Charan and Jr NTR Friendship Photos

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ