Advertisementt

వర్మ బీర్ పార్టీనే.. నభా కొంపముంచింది!

Sun 04th Aug 2019 08:42 PM
rgv,beer party,effect,nabha natesh  వర్మ బీర్ పార్టీనే.. నభా కొంపముంచింది!
RGV beer Party effect on Nabha Natesh వర్మ బీర్ పార్టీనే.. నభా కొంపముంచింది!
Advertisement
Ads by CJ

అనుకోకుండా వచ్చిన హిట్ ఆ మూవీ టీం పిచ్చెక్కి ఆనందంతో తెగ ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. రాకరాక వచ్చిన హిట్ ని ఎంజాయ్ చెయ్యడమే కాదు... ఇంకా బూస్ట్ ఇస్తూ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంది. మరి వారెవరో తెలిసిపోయింది కదూ. వారే ఇస్మార్ట్ శంకర్ మూవీ టీం. మూవీ డైరెక్టర్ పూరి, నిర్మాత ఛార్మి, హీరోయిన్ నిధి ఇంకా టీం కలిసి సినిమా హిట్ అయ్యాక తెగ ప్రమోషన్స్ చేస్తూ సక్సెస్ టూర్ అంటూ ఊరూరా తిరుగుతుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే రామ్ ఇస్మార్ట్ ప్రమోషన్స్ ని వదిలేసి ఫారిన్ చెక్కేసాడు. ఇక విడుదలయ్యాక సక్సెస్ సెలెబ్రేషన్స్ లో భాగంగా రామ్ గోపాల్ వర్మతో పూరి, ఛార్మి, హీరోయిన్ నిధి అగర్వాల్, నభా నటాషాలు బీర్ పార్టీ చేసుకున్నారు.

ఇక ఆ పార్టీ తర్వాత పూరి అండ్ కో విజయవాడ, గుంటూరు, వైజాగ్ ఇలా తిరుగుతూ ఇస్మార్ట్ ప్రమోషన్స్ నిర్వహించింది. అయితే ఈ ప్రమోషన్స్ లో ఛార్మి, పూరితో పాటుగా నిధి అగర్వాల్ వెళ్ళింది కానీ.. నభా నటాషా మాత్రం ఆ సక్సెస్ టూర్ లో పాల్గొనలేదు. అయితే నిన్న జరిగిన ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ మీట్ వరకు నభా ఆచూకీ లేదు. అయితే డిస్కో రాజా షూటింగ్ లో బిజీగా ఉండి నభా ఇస్మార్ట్ ప్రమోషన్స్ కి దూరంగా ఉందేమో అనుకున్నారు. అందుకే ఇస్మార్ట్ శంకర్ తో హీరోయిన్ గా తనకి మంచి పేరొచ్చినా ఆమె ఈ ప్రమోషన్స్ లో పాల్గొనలేదు అని ఫిక్స్ అయ్యారు. 

తాజాగా నభా ఇస్మార్ట్ ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడానికి అసలు కారణం రామ్ గోపాల్ వర్మతో చేసుకున్న బీర్ పార్టీ అని తెలుస్తుంది. వర్మ చేసిన బీర్ పార్టీలో తడిసి ముద్దయిన నభా నటాషాకి నెక్స్ట్ డే నుండి విపరీతమైన జ్వరం రావడం కారణంగానే ఆమె ఇస్మార్ట్ ప్రమోషన్స్ కి దూరమైనట్లుగా లేటెస్ట్ సమాచారం.

RGV beer Party effect on Nabha Natesh:

This is the reason for Nabha absent for Ismart shankar Promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ