తీన్మార్ సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు అస్సలు పరిచయం అక్కర్లేదు. తీన్మార్ వార్తలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న శివజ్యోతి అలియాస్ సావిత్రి.. ఒక్కసారి ఈమె లైఫ్‌లోకి తొంగి చూస్తే కన్నీళ్లు పెట్టించే బాధలున్నాయ్. అంతేకాదు ఈ ప్రేమ కథ వింటే మీకు కూడా కన్నీళ్లు ఆగవ్ అంతే. తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3కు సావిత్రి సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే.
ఇటీవల బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు వారి జీవితంలో జరిగిన ఘటనలు, ప్రేమ కథలు చెప్పారు. వీరందరిలో శివజ్యోతి చెప్పిన ప్రేమ గాథ విన్న ప్రేక్షకులు కంటతడి పెట్టేశారు. ‘19 ఏళ్ల వయసులో నేను ఒక అబ్బాయిని ప్రేమించాను.. మేం ఫోన్‌లు మాట్లాడుకుంటున్నామనే విషయం ఒక ఆరునెలల్లోనే ఇంట్లో తెలిసిపోయింది. అందరి ఇళ్లలో నువ్ వాడిని వదిలిపెట్టకపోతే మేం చచ్చిపోతాం అని బ్లాక్ మెయిల్ చేస్తారు. కానీ.. నా విషయంలో నువ్ వాడిని వదిలేయకపోతే వాడ్నే చంపేస్తాం అని బ్లాక్ మెయిల్ చేశారు. ఊరంతా ఒక వైపు ఉంటే.. నేనొక్కదాన్ని మా ఆయన కోసం నిలబడ్డాను. చంపితే నన్ను చంపుతారు అంతే కదా అనుకున్నాను. నా నాలుక మీద తప్ప ఒళ్లంతా దెబ్బలు భరించాను.
అలా మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుంచి హైదరాబాద్‌కి పారిపోయి వచ్చాను. నా భర్త నన్ను మహరాణిలా చూసుకున్నాడు. ఇలాంటి భర్త ప్రతి అమ్మాయికి రావాలని కోరుకుంటున్నాను. లైఫ్ అందరికీ సెకండ్ ఛాన్స్ ఇస్తుంది కానీ.. నాకు సెకండ్ లైఫ్ ఇచ్చింది. ఎప్పటికీ అతన్నే ప్రేమిస్తూనే ఉంటాను’ అని భర్త గురించి పదే పదే చెప్పిన సావిత్రి కన్నీరు మున్నీరైంది. ఈ ఎపిసోడ్ మొత్తానికి ఈమె ప్రేమ కథే హైలైట్‌గా నిలిచింది.