Advertisementt

రష్మీ అట్టర్‌ప్లాప్.. అనసూయ సంగతేంటో..!

Sun 04th Aug 2019 03:22 PM
reshmi,anasuya,sivaranjini,kathanam  రష్మీ అట్టర్‌ప్లాప్.. అనసూయ సంగతేంటో..!
Reshmi uttar flop.. What About Anasuya! రష్మీ అట్టర్‌ప్లాప్.. అనసూయ సంగతేంటో..!
Advertisement
Ads by CJ

ర‌ష్మి గౌత‌మ్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ఇద్దరూ ఇద్దరే.. బుల్లి తెరపై అంద చెందాలతో ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేయడంలో ఇద్దరూ సూపర్ సక్సెస్ అయ్యారు. అయితే వెండి తెరపై సక్సెస్ కావడానికి ఈ ఇద్దరు హాట్ భామలు చేయని భగీరథ ప్రయత్నాల్లేవ్. అనసూయ సినిమాల్లో పాత్రలతో.. అప్పుడప్పుడు లీడ్ రోల్స్‌తో బిజిబిజీగా ఉంటే.. రష్మి మాత్రం హీరోయిన్‌గానే అదృష్టాన్ని పరిశీలించుకుంటోంది. ఇప్పటికే ఈ ఇద్దరు చేసిన సినిమాలు పర్వాలేదు అనిపించాయ్.

తాజాగా ‘శివరంజని’గా రష్మి అభిమానుల ముందుకు వచ్చింది. అయితే సినిమాలో పెద్దగా పసలేదని.. జనాలు ఆదరించట్లేదని ఫస్ట్ షోతోనే తేలిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే రష్మి ‘గుంటూరు టాకీస్’తో పోలిస్తే అట్టర్ ప్లాప్ అయ్యిందని నెటిజన్లు, ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇందుకు కారణం.. పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడమేనని తెలుస్తోంది.

ఇక ‘కథనం’ విషయానికొస్తే.. ఈ నెల 9న థియేటర్లలోకి రానుంది. ఇప్పటి వరకూ విడుదలైన ఫస్ట్ లుక్స్, థ్రెటికల్ టైలర్స్ బాగున్నాయ్. అంతేకాదు.. అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్‌సింగ్‌లు నటించిన ‘మన్మథుడు 2’ సినిమాతో పోటీ పడుతూ రెండు సినిమాలు ఒకే రోజులు విడుదలవుతున్నాయి. అనసూయ కథనం ఇప్పటి వరకూ ఓకే.. మన్మథుడు రంగంలోకి దిగితే పరిస్థితేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అభిమానులు ఈ ‘కథనం’ కథను చూసి అనసూయ తలరాత మారుస్తారో లేకుంటే బుల్లితెరకే పరిమితం చేస్తారో వేచి చూడాల్సిందే మరి.

Reshmi uttar flop.. What About Anasuya!:

Reshmi uttar flop.. What About Anasuya!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ