Advertisementt

నాకు ‘సరైనోడు’ దొరికాడు.. ఫుల్ హ్యాపీ!

Sun 04th Aug 2019 03:08 PM
happy,husband,shreya saran,tollywood  నాకు ‘సరైనోడు’ దొరికాడు.. ఫుల్ హ్యాపీ!
Iam Full Happy With My Husband Says Shreya saran నాకు ‘సరైనోడు’ దొరికాడు.. ఫుల్ హ్యాపీ!
Advertisement
Ads by CJ

శ్రియా శరన్.. ఈ ముద్దుగుమ్మ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. వరుసబెట్టి స్టార్ హీరోలందరితో నటించేసి బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు చిన్న పెద్దా అనే తేడా లేకుండా అందరి హీరోలతోనూ.. ఆఖరికి వేశ్య పాత్రలోనూ నటించి మెప్పించింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో కొత్త భామల లోడ్ ఎక్కువవడంతో.. శ్రియాకు పెద్దగా అవకాశాలు రాలేదు. 

అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న టైమ్‌లోనే ఈ ముదురు భామ తాను ప్రేమించిన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రియా కొశ్చెన్‌ను పెళ్లి చేసేసుకుంది. పెళ్లి తర్వాత పెద్దగా సినిమాల్లో నటించని శ్రియ.. లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల తన లైఫ్ ఈ భామ చెబుతూ.. పెళ్లి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాని.. ఈ లైఫ్ చాలా సంతోషంగా ఉందని చెబుతోంది. ‘లైఫ్‌లో నాకు సరైన సమయంలో ‘సరైనోడు’ వ్యక్తి దొరికాడు’ అంటూ ఈ భామ గాల్లో తేలిపోతోంది.

ఇంటి పనులు శ్రియా ఒక్కటే కాదు.. ఆయన భర్త కూడా షేర్ చేసుకుంటాడట. టిఫిన్ కూడా ఆయనే భర్త ప్రిపేర్ చేస్తాడని ముద్దుల భర్తను ఆకాశానికెత్తేస్తోంది. అంతేకాదు.. ఇక సినిమా అవకాశాలొస్తే సరే లేకుంటే భర్తతో గడిపేస్తానని.. జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులును ధ్యానం, యోగాతో జవాబు చెబుతానని శ్రియ చెబుతోంది.

Iam Full Happy With My Husband Says Shreya saran:

Iam Full Happy With My Husband Says Shreya saran  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ