అవకాశాలు ఉన్నన్ని రోజులే ఎవరైనా.. ఆ తర్వాత అవకాశాలెక్కడొస్తాయా..? ఎక్కడ తమకు అనువుగా ఉంటుందనే చోటికి రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంటారు జనాలు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనూ అదే పరిస్థితి. టాలీవుడ్ పోతే కోలీవుడ్.. అదీ పోతే బాలీవుడ్ మూడూ పోతే నాలుగు గోడలకే పరిమితం లేదా బిజినెస్.. అదీ లేకుంటే మూడు ముళ్లే శరణ్యం.. ఇదీ హీరోయిన్ల పరిస్థితి.
ఇక అసలు విషయానికొస్తే.. బాలీవుడ్ టూ టాలీవుడ్‌కు వచ్చిన కియారా అద్వాణీ.. చేసింది రెండు సినిమాలో అయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు దక్కించుకుంది. ‘భరత్ అనే నేను’తో సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ భామకు ‘వినయ విధేయ రామ’ మాత్రం పెద్దగా ఆడలేదు. అయితే ఈ భామకు మాత్రం అటు బాలీవుడ్‌లో.. ఇటు టాలీవుడ్‌లో అవకాశాలు మాత్రం తగ్గలేదు. అయితే వీటిలో కొన్నింటిని కియారా కాదనుకోగా.. మరికొన్ని మాత్రం టైమ్ లేక నో చెప్పేసింది.
అయితే ఈ భామకు పూర్తిగా టాలీవుడ్‌కు టాటా చెప్పేయాలని భావిస్తోందట. ఇందుకు కారణం బాలీవుడ్ ‘కబీర్‌సింగ్’ బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో ఇప్పుడిక ఈ భామకు మళ్లీ టాలీవుడ్‌కు రావాల్సిన అవసరం లేకపోయింది. దీంతో ఇక ఇక్కడే సెట్ అవ్వాలని టాలీవుడ్‌కు అక్కర్లేదని భావిస్తోందట. అంతేకాదు.. బాలీవుడ్‌లో అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తుండటంతో ఇక తెలుగులోకి రావాల్సిన అవసరం ఏముంటది చెప్పండి!.