టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో ‘రామాయణం’ నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నితేష్ తివారీ (దంగల్ ఫేం), రవి ఉద్యవర్ (మామ్ ఫేం) తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఎవరెవర్ని తీసుకోవాలి..? అని పాత్రదారులను వెతికే పనిలో దర్శకనిర్మాతలు బిజిబిజీగా ఉన్నారు. అయితే రాముడు పాత్రకుగాను మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నో చెప్పడంతో ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను సంప్రదించారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు పుట్టుకొచ్చాయి.
అయితే ఇలాంటి వార్తలు ఎవరు పుట్టిస్తారో ఏమోగానీ.. తాజాగా ఎన్టీఆర్ గురించి మరో పుకారు షికారు చేస్తోంది. ఇంత వరకూ రాముడు అనుకుంటే ఇప్పుడు రావణుడు పాత్రలో ఎన్టీఆర్ అయితే అచ్చుగుద్దినట్లుగా ఉంటారని భావించిన చిత్రబృందం త్వరలోనే ఆయన్ను సంప్రదించాలని యోచిస్తోందట.
సో.. ముందు రాముడు.. ఇప్పుడు రావణుడు ఇలా పాత్రలు మారుస్తున్నారంతే. అసలు చిత్రబృందం ఇంత వరకూ స్పందించిందా..? లేదా అనేది మాత్రం ఇంత వరకూ ఎక్కడా అధికారికంగా ప్రకటన గానీ.. కనీసం ఈ పుకార్లపై సినిమా యూనిట్ లేదా.. ఎన్టీఆర్ రియాక్ట్ అవ్వడం జరగలేదు. సో.. మున్ముంథు ఎన్టీఆర్‌పై మరెన్ని పుకార్లు సృష్టిస్తారో మరి.