ఇదిగో ఈ పక్కనున్న ఫోటోలో ఉండే లేడీని గుర్తు పట్టారా..? గుర్తుకు రాలేదా..? ఇంకాస్త నిశితంగా గమనించండి గుర్తుపడతారేమో. అదేనండి.. మెగా డాటర్ నిహారిక గుర్తొచ్చింది కదా. నిహారికను ఇలా చూసిన మెగా ఫ్యాన్స్, నెటిజన్లు కంగుతిన్నారు. వామ్మో నిహారిక ఏంటి..? ఇలా ఉంది..? ఎందుకిలా తయారైందని అందరూ ఆశ్చర్యపోయారట.
ప్రస్తుతానికి మెగా డాటర్ చేసేంత సినిమాలు లేవు.. ఆమెకు అవకాశాలిచ్చి హీరోయిన్‌గా పెట్టుకునే డైరెక్టర్సూ లేరు.. అయితే ఈ లుక్ దేనికోసం మరి. సినిమా అవకాశాలు లేకపోవడంతో వెబ్ సీరిస్‌పై మెగా భామ దృష్టి సారించింది. ఇదిగో ఈ గెటప్ ‘డ్రాగన్ క్వీన్ ఖలీసి’ కోసమట. గతంలో జరిగిన కొన్ని విషయాలను ఈ వెబ్ సీరిస్ ద్వారా నిహారిక మళ్లీ గుర్తుకు తెస్తోంది.
కాగా.. ఈ లుక్‌పై మెగాభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. నిహారిక అవకాశాలు రాకపోతే మాత్రం ఇలాంటి వేషాలేంట్రా బాబూ.. ఇంతకుమించి పాత్రలేమీ దొరకలేదా..? అంటూ కన్నెర్రజేస్తున్నారు. నిహారికను మున్ముంథు ఇలా ఎన్ని గెటప్స్‌లో చూడాలో మరి.