Advertisementt

అయ్యో.. ఆయనతో పోల్చకండి..: సాహో డైరెక్టర్

Sat 03rd Aug 2019 10:53 AM
saho director,shankar,comparison,saaho  అయ్యో.. ఆయనతో పోల్చకండి..: సాహో డైరెక్టర్
Saho Director Reacts On Star Director Shankar Comparison అయ్యో.. ఆయనతో పోల్చకండి..: సాహో డైరెక్టర్
Advertisement
Ads by CJ

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఫస్ట్‌లుక్, టీజర్‌లు, సడన్ సర్‌ఫ్రైజ్‌లతో అభిమానులు, సినీ ప్రియుల్లో ఆసక్తి పెంచేసిన చిత్రబృందం.. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా అగ‌స్ట్ 30న ప్రపంచ‌ వ్యాప్తంగా ‘సాహో’ భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జులై మొదటి వారం నుంచి ప్రమోషన్స్‌లో చిత్రబృందం బిజిబిజీగా ఉండనుంది.

తాజాగా ‘సాహో’ డైరెక్టర్ సుజిత్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులు ‘ఏ చోట నువ్వున్నా..’ పాట గురించి మాట్లాడుతూ.. స్టార్ డైరెక్టర్ శంకర్ రేంజ్‌లో తీశారు కదండి అని అడగ్గా.. ఆయన చాలా లాజిక్‌గా సమాధానమిచ్చారు.

‘అయ్యో.. శంకర్ గారు పాటల్ని డీల్ చేసే విధానం వేరు. ఆయన రేంజ్‌ వేరు.. నా రేంజ్‌ వేరు.. ఆయనతో నన్ను పోలుస్తున్నారు.. అస్సలు వద్దండి’ అని చెప్పుకొచ్చారు సుజీత్. అయితే ఈ సాంగ్‌ చూసిన చాలా మంది కాల్ చేసి శంకర్ గారిలా సాంగ్ తీశారని మెచ్చుకున్నారని తన మనసులోని మాటను సుజిత్ బయటపెట్టారు.

Saho Director Reacts On Star Director Shankar Comparison:

Saho Director Reacts On Star Director Shankar Comparison  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ