ప్రముఖ సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు కొడుకు ప్రకాష్ కోవెలమూడి కూడా దర్శకుడే. ఇతను తెలుగులో మూడు సినిమాలు చేసాడు. లేటెస్ట్ గా ఈయన బాలీవుడ్ లో జడ్జిమెంటల్ హై క్యా అనే చిత్రం తీసి సక్సెస్ అందుకున్నాడు. అయితే ఈసినిమా ప్రమోషన్స్ టైములో ఈ డైరెక్టర్ తన భార్య అయిన బాలీవుడ్ స్క్రీన్ రైటర్ కనికా దిల్లోన్ తో విడిపోయానని అధికారికంగా ప్రకటించాడు.
అలానే కనికా కూడా మేము 2017 నుండి సపరేట్ గా ఉంటున్నాం అని చెప్పారు. మేము విడిపోయినా ఇప్పటికి మంచి ఫ్రెండ్స్ గానే ఉన్నాం. ఇద్దరు ఫ్యూచర్ లో కలిసి పని చేసే అవకాశం కూడా ఉంది. ఇక వీరు 2014 లో పెళ్లి చేసుకున్నారు. ప్రకాష్ డైరెక్టర్ గా... కనికా రైటర్ గా అనుష్క సైజు జీరోకి పనిచేసారు.
అలానే లేటెస్ట్ గా వచ్చిన బాలీవుడ్ థ్రిల్లర్ జడ్జిమెంటల్ హై క్యా అనే చిత్రంకి కూడా కలిసి పనిచేసారు. ఇక కనికా బాలీవుడ్ లో పెద్ద సినిమాలకి స్క్రీన్ ప్లే రాసారు. ఉదాహరణలు మన్మజియాన్, కేదార్నాథ్, రావన్.