Advertisementt

‘రాక్షసుడు’నే నమ్ముకుంది.. ఏం చేస్తాడో?

Fri 02nd Aug 2019 11:35 PM
anupama parameswaran,waiting,rakshasudu,result  ‘రాక్షసుడు’నే నమ్ముకుంది.. ఏం చేస్తాడో?
Anupama Parameswaran hopes on Rakshasudu Movie ‘రాక్షసుడు’నే నమ్ముకుంది.. ఏం చేస్తాడో?
Advertisement
Ads by CJ

శతమానం భవతి చిత్రంతో హిట్ కొట్టిన అనుపమ పరమేశ్వరన్.. ఉన్నది ఒకటే జిందగీతో యావరేజ్ అందుకుంది. ఇక తేజ్ ఐ లవ్ యు తో డిజాస్టర్ అందుకున్న అనుపమ హలో గురు ప్రేమకోసమేతో యావరేజ్ అందుకుంది. ఇక ఓ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మిస్ అయిన అనుపమ ఇప్పుడు దాని గురించి చాలా బాధపడుతుంది. రంగస్థలం చిత్రంలో రామలక్ష్మి పాత్రతో భారీ హిట్ అందుకున్న సమంతకొస్తున్న పేరు అసలైతే అనుపమకు రావాల్సింది. కానీ కొన్నికారణాల వలన రంగస్థలం ఆఫర్ ని కాలదన్నుకుంది ఈ చిన్నది. ఇక క్యూట్ గా పద్డతిగా కనిపించే అనుపమకు కెరీర్ లో ఓ అన్నంత హిట్స్ అయితే పడడం లేదు.

ప్రస్తుతం బెల్లంకొండ సరసన రాక్షసుడు సినిమాలో టీచర్ పాత్రలో అనుపమ కనిపిస్తుంది.  తమిళనాట భారీ హిట్ కొట్టిన సస్పెన్స్ థ్రిల్లర్ రాక్షసన్ సినిమా తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అనుపమ హీరోయిన్ గా రీమేక్ అయ్యింది. తమిళ రాక్షసన్ లో అమల పాల్ హీరోయిన్ అయితే... తెలుగులో అనుపమ హీరోయిన్. టీచర్ క్యారెక్టర్ లో అనుక్షణం హీరో చుట్టూతా తిరిగే పాత్రని చేసింది. 

ఇక టీచర్ గా కట్టు బొట్టు.. చాలా సాదా సీదా చీరల్లో కనిపిస్తున్న అనుపమ మాత్రం క్యూట్ లుక్స్ తో అదరగొట్టేస్తుంది. ఇక అనుపమకు తెలుగులో ఈ రాక్షసుడు సినిమా తప్ప మరో సినిమా లేదు. ఇక ఈ సినిమా గనక కోలీవుడ్ లో సెన్సేషన్ హిట్ అయినట్లుగా తెలుగులోనూ హిట్ అయితే అనుపమ ఫేట్ ఏమన్నా మారుతుంది. చూద్దాం.. రాక్షసుడు అనుపమకు ఏమాత్రం లాభాన్ని తెచ్చిపెడుతుందో అనేది.

Anupama Parameswaran hopes on Rakshasudu Movie:

Anupama Parameswaran Waiting for Rakshasudu result

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ