Advertisementt

బిగ్‌‘బాస్’ అనిపించిన నాగ్.. సరికొత్త రికార్డ్!

Fri 02nd Aug 2019 07:13 PM
biggboss-3,akkineni nagarjuna,jr ntr,nani  బిగ్‌‘బాస్’ అనిపించిన నాగ్.. సరికొత్త రికార్డ్!
Biggboss-3 Host Akkineni Nag Record! బిగ్‌‘బాస్’ అనిపించిన నాగ్.. సరికొత్త రికార్డ్!
Advertisement
Ads by CJ

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 జులై-23 నుంచి ఇవాళ్టి వరకూ విజయవంతంగా దూసుకెళ్తోంది. సీజన్ 1,2 కంటే 3 నే బిగ్‌బాస్ ప్రియులు ఆదరిస్తున్నారు. తాజాగా టెలివిజన్ రేటింగ్స్‌ను ‘మా’ టీవీ యాజమాన్యం విడుదల చేసింది. అయితే మొదటి వారంలోనే ఈ సీజన్ 3 ఏకంగా టెలివిజన్ చరిత్రలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం విశేషమని చెప్పుకోవచ్చు. 

‘మా’ టీవీకి ఈ బిగ్‌బాస్ షో 17.9 టీఆర్పీ రేటింగ్స్ తెచ్చిపెట్టింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన సీజన్‌-1కు టీఆర్పీ రేటింగ్స్ 16.18.. నానీ హోస్ట్‌గా వ్యవహరించిన సెకండ్ సీజన్ 15.05 టీఆర్పీ రేటింగ్స్ మాత్రమే వచ్చాయి. అయితే ఈ ఇద్దరితో.. ఈ రెండు సీజన్లతో పోల్చుకుంటే నిజంగా నాగ్ బిగ్ ‘బాస్’ అనిపించారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

వాస్తవానికి నాగ్ ఇలా హోస్టింగ్ చేయడం కొత్తేమీ కాదు.. ఇప్పటికే ఇదే ‘మా’ టీవీలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రియాలిటీ షోతో ఎంట్రీ ఇచ్చి తన వాక్ చాతుర్యం.. సీనియార్టీతో అదరగొట్టేసి టీఆర్పీ రేటింగ్స్‌ను ఎక్కడికో తీసుకెళ్లారు. అందుకే బిగ్‌బాస్-3కి అక్కినేని అయితేనే సెట్ అవుతారని.. కచ్చితంగా తన సక్సెస్ మంత్రతో దీన్ని కూడా విజయవంతంగా నడిపిస్తారని నిర్వాహకులు పట్టుబట్టి మరీ హోస్ట్‌గా తీసుకోవడం జరిగింది.

Biggboss-3 Host Akkineni Nag Record!:

Biggboss-3 Host Akkineni Nag Record!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ