హాట్ యాంకర్ అనసూయ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. డ్రెస్సింగ్‌లో.. నటనలో.. యాంకరింగ్.. తన తర్వాతే ఎవరైనా అంటూ ఫీలైపోతుంటుంది. అయితే అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేందుకు ఒక్కోసారి తన డ్రెస్సింగ్ ఒక్కోసారి డోస్ పెంచేస్తుంది. అలా చేసినప్పుడల్లా నెటిజన్లు, సొంత వీరాభిమానుల నుంచి మాత్రం చీవాట్లు మాత్రం తప్పనిసరే. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు చాలా దగ్గరయ్యే వారిలో అనసూయ ఒకరు. అలా నిత్యం తనకు సంబంధించిన షో, కార్యక్రమాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అయితే తాజాగా అనసూయ పోస్ట్ చేసిన ఫొటోలు కుర్రకారు, అభిమానుల్లో హీట్ పెంచేసింది. దీంతో ఈ ఫొటోలను చూసిన వీరాభిమానులు కొందరు ‘అబ్బా..’ అంటూ ‘ఫిదా’ అయి ఊరుకోగా.. నెటిజన్లు మాత్రం దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదిగో ఈ రెడ్ కలర్ చెక్ షర్ట్.. దానికింద సగం చిరిగిన స్కర్ట్.. ఈ డ్రెస్‌లో ఈ హాట్ బ్యూటీని చూసిన కొందరు ‘ఏమ్మా.. బట్టలు కొనేందుకు డబ్లులు లేవా.. చిరిగినవి ఏస్కున్నావ్.. సిగ్గనిపించడం లేదా..? ’ అని కన్నెర్రజేస్తున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం.. ‘ఎవరు చెప్పారు.. కోహినూర్ వజ్రంను బ్రిటిష్ వాళ్లు తీసుకెళ్లారని.. ఇక్కడే ఉంది కదరా బాబూ..’ అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తమ్మీద కొందరు తిట్టిపోసినప్పటికీ.. ఇలా అభిమానులు పోలుస్తుండటంతో అనసూయ ఆనందంతో ఉబ్బితబ్బిబైందట. ఏదేమైనా ఇలాంటి ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఒక స్ట్రాటజీ అని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.