ఇదిగో ఈ ఫొటో వైపు ఓ లుక్కేయండి.. ఈమెను ఎక్కడో చూశాం అనిపిస్తోంది కదూ.. అవును మీరు చూసింది విన్నది నిజమే అద్దాలు లేకపోయేసరికి కాస్త కన్ఫూజ్ అయ్యారేమో.. ఆమే యాంకర్ శ్వేతారెడ్డే. అదేనండి ఒకప్పుడు ఓ ప్రముఖ చానెల్‌లో న్యూస్ యాంకర్‌గా ఆ తర్వాత.. యూట్యూబ్‌లో పెద్దలను ఇంటర్వ్యూలతో ఫేమస్ అయ్యింది. తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా సెలెక్ట్ చేసి.. లైంగికంగా వేధించారని.. చివరికి హౌస్‌లోకి అడుగుపెట్టనివ్వకుండా అన్యాయం చేశారని పోలీస్ స్టేషన్లు.. కోర్టు మెటెక్కిన విషయం విదితమే. అయితే ఈమెకు ఎక్కడా న్యాయం జరగలేదు.!
క్యాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఉద్యమించి నానా హడావుడి చేసి.. తన దగ్గరున్న సీక్రెట్ ఫొటోలతో ప్రముఖులందరికీ చుక్కలుచూపించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా తనపేరు మార్మోగేలా చేసుకుంది. ఆ తర్వాత హైదరాబాద్‌ను వదిలేసి చెన్నైకి వెళ్లి సినిమా అవకాశాలు దక్కించుకుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే పైన చెప్పి శ్రీరెడ్డి.. శ్వేతారెడ్డి ఇద్దరూ ఇద్దరే.. ఎవరికెవరూ తగ్గరు. అలాంటిది ఇప్పుడు ఇద్దరూ వివాదాల మధ్య కలుసుకుని ఉద్యమించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల వీరిద్దరూ కలిసి.. ఇక కాస్కోండన్నట్లుగా సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేశారు. ‘లైంగిక వేధింపులకు మేము ఎప్పుడూ మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. అలా చేస్తే రెడ్డి సిస్టర్స్ తొక్కతీస్తారు కొడుకులది’ అని రెడ్డి సిస్టర్స్ ఘాటుగా చెప్పుకొచ్చారు. మరి మున్ముంధు ఈ రెడ్డి సిస్టర్స్ ఏం చేయబోతున్నారో వేచి చూడాల్సిందే మరి.