‘మిస్టర్ కిల్లర్’ టీజర్‌ను విడుదల చేసిన అల్లరి నరేష్
రమేష్ స్టూడియోస్, శ్రీనిక్షిత ప్రొడక్షన్స్ పతాకాలపై చార్లెస్ దర్శకత్వంలో రమేష్‌బాబు ధూళిపాళ, శ్రీకృష్ణ శ్రవణ్ తుమ్మలపల్లి నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘మిస్టర్ కిల్లర్’. విశ్వ, కృష్ణ కురుప్, బ్రహ్మానందం, గిరిధర్, నరేన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ మొత్తం కాశ్మీర్‌లోనే జరగడం విశేషం. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ నటుడు అల్లరి నరేష్ విడుదల చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగష్టులో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ - ‘‘మిస్టర్ కిల్లర్ తెలుగు, తమిళ భాషలలో రూపొందిన సినిమా. త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. ప్రొడ్యూసర్ రమేష్‌గారు, అలాగే హీరోగా విశ్వ, కృష్ణ కురుప్‌లు నటించడం జరిగింది. కథ, దర్శకత్వం చార్లెస్. ఈ సినిమా మంచి విజయం సాధించి ప్రొడ్యూసర్‌గా రమేష్‌గారికి, దర్శకుడికి, ఆర్టిస్టులకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే ఎంటైర్ టీంకి అల్ ది బెస్ట్’’ అన్నారు.
విశ్వ, కృష్ణ కురుప్, బ్రహ్మానందం, గిరిధర్, నరేష్ పధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బాలమురుగన్, ఎడిటర్: బి.ప్రవీణ్, మ్యూజిక్: వేద్ శంకర్ సుగవనం, సింగర్స్: దామిని భట్ల, ధనుంజయ్, నిర్మాతలు: రమేష్‌బాబు ధూళిపాళ, శ్రీకృష్ణ శ్రవణ్ తుమ్మలపల్లి, కథ, దర్శకత్వం: చార్లెస్