ఆంధ్రప్రదేశ్‌కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం టాలీవుడ్‌కు ఇష్టం లేదు.. అంటూ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ఇటు టాలీవుడ్‌లో.. అటు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళీ రియాక్ట్ అయ్యి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
పృథ్వీ కామెంట్స్‌ను పోసాని తీవ్రంగా ఖండించారు. జగన్ సీఎం కావడం సినీ పెద్దలకు ఇష్టం లేదనడం కరెక్ట్ కాదన్నారు. పృథ్వీ తొందరపడి అలా మాట్లాడారని తాను అనుకుంటున్నానని పోసాని చెప్పుకొచ్చారు. పృథ్వీ వ్యాఖ్యలను పోసాని ‘బిగ్ మిస్టేక్’గా అభివర్ణించారు. అంతటితొ ఆగని ఆయన.. సీఎం అయిన జగన్‌ను కలిసి.. ఓ పూల దండ వేసి, అభినందిస్తే, ఆయనపై ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేదనుకుంటే అది పొరపాటేన్నారు.
సినిమా వాళ్లందరూ కలిసి వైఎస్ జగన్‌ని అభినందించేందుకు టైమ్ ఇస్తారా? అది జరగని పని కదా..? అని పోసాని చెప్పుకొచ్చారు. వాస్తవానికి మొన్నటి వరకూ పృథ్వీ-పోసాని ఇద్దరూ మిత్రులే. అయితే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మాట్లాడిన మాటలను సున్నితంగా తిరస్కరిస్తూ ‘తెలియక మాట్లాడారు’ అని పోసాని వ్యాఖ్యానించారు. అయితే పోసాని పంచ్‌లకు పృథ్వీ ఎలా రియాక్ట్ అవుతారో మరి. మొత్తానికి చూస్తే పృథ్వీ వర్సెస్ పోసాని అంటూ కౌంటర్ల వర్షం కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.