Advertisementt

పూరీ ‘జనగణమన’కు టాలీవుడ్‌లో హీరోలే లేరా!

Thu 01st Aug 2019 02:06 PM
kgf star yash,puri jagannadh,jana gana mana,mahesh babu  పూరీ ‘జనగణమన’కు టాలీవుడ్‌లో హీరోలే లేరా!
KGF star Yash to act in Puri Jagannadh’s Jana Gana Mana? పూరీ ‘జనగణమన’కు టాలీవుడ్‌లో హీరోలే లేరా!
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ‘జనగణమన’ సినిమా తెరకెక్కించాలని భావించిన విషయం విదితమే. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఆ కారణాలేంటన్నది ఇక్కడ అప్రస్తుతం.. అసందర్భం కూడా. చాలా రోజుల తర్వాత పూరీకి ‘ఇస్మార్ట్ శంకర్’ రూపంలో హిట్ పడటంతో ఇక ఇదే కిక్‌తో ‘జనగణమన’ షురూ చేయాలని భావిస్తున్నారట.

ఈ సినిమా మహేశ్‌తో కాకుండా మరొకరితో తెరకెక్కించలేనని.. ఇప్పటికే పలుమార్లు చెప్పడమే కాదు ఓ పెద్ద డైలాగ్ కూడా పేల్చాడు. అయితే ఇప్పుడు మాత్రం మహేశ్‌నే కాదు టాలీవుడ్‌లో ఎవరూ వద్దనుకున్న పూరీ ఏకంగా కన్నడ హీరోను ఫిక్స్ చేసేశారట. ఆయనెవరో కాదు.. ‘కేజీఎఫ్’ సినిమాతో భారీ హిట్ చిత్రాన్ని ఖాతాలో వేసుకుని స్టార్ హీరోగా మారిన ‘యష్’తో తెరకెక్కించాలని ఫిక్స్ అయిపోయారట.

ఇటీవలే బెంగళూరులో యష్‌ను కలిసిన పూరి కథ చెప్పాడట. కథ మొత్తం విన్న యష్ అక్కడక్కడ చిన్నపాటి మార్పులు చేయండి సార్.. అని సందేహిస్తూ సూచనలు సైతం చేశారట. త్వరలోనే మార్పులు చేర్పులు చేసి కథ తీసుకొస్తానని పూరీ చెప్పారట. అయితే ఈ సారి కథ చెప్పాక అధికారికంగా ప్రకటించే యోచనలో పూరీ ఉన్నారట. ‘జనగణమన’ను తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ ఇదే నిజమైతే.. తెలుగు ప్రేక్షకులు.. మరీ ముఖ్యంగా మహేశ్ వీరాభిమానులు ఏ మాత్రం ఆదరిస్తారో వేచిచూడాల్సిందే మరి.

KGF star Yash to act in Puri Jagannadh’s Jana Gana Mana?:

KGF star Yash to act in Puri Jagannadh’s Jana Gana Mana?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ