Advertisementt

నాగ‌శౌర్య సినిమాకి కేజీఎఫ్ టచ్

Thu 01st Aug 2019 11:52 AM
naga shourya,mehareen,ira creations,kgf movie,action episodes  నాగ‌శౌర్య సినిమాకి కేజీఎఫ్ టచ్
KGF Touch to Naga Shourya Next Film నాగ‌శౌర్య సినిమాకి కేజీఎఫ్ టచ్
Advertisement
Ads by CJ

యాక్ష‌న్ నేప‌థ్యంతో నాగశౌర్య‌, ఐరా క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం 3

యూత్ హీరో నాగశౌర్య‌, బ‌బ్లీ బ్యూటీ మెహ‌రిన్ జంట‌గా ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌లుగా ప్రొడ‌క్ష‌న్ నెం 3 రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ ఈ సినిమాతో తెలుగు తెరకు ప‌రిచ‌యం అవుతున్నారు. అటు క్లాస్ ఇటు మాస్ ఆడియెన్స్ ని అల‌రించాల‌నే ఉద్దేశంతో ఈ సినిమాలో కాస్త ఎక్కువగానే యాక్ష‌న్ స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్న‌ట్లుగా యూనిట్ స‌భ్యులు చెబుతున్నారు. ప్యాన్ ఇండియా హిట్ గా నిలిచిన కేజీఎఫ్ కి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు అరివు మాస్ట‌ర్స్ తెలుగులో మొద‌టిసారిగా నాగ‌శౌర్య సినిమాకి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫి చేస్తుండ‌టం విశేషం. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌లే వైజాగ్ లో ఈ సినిమాకి సంబంధించిన ఓ యాక్ష‌న్ సీన్ ని షూట్ చేస్తుండ‌గా నాగ‌శౌర్య కాలికి గాయ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే పూర్తిగా గాయం నుంచి కోలుకోకుండానే నాగ‌శౌర్య మ‌ళ్లీ షూట్ లోకి జాయిన్ అవ్వ‌డం జ‌రిగింది. అన్బుఅరివు మాస్ట‌ర్స్ కి తెలుగులో ఇది మొద‌టి సినిమా కావ‌డంతో, యాక్ష‌న్ సన్నివేశాల్ని చాలా అద్భుతంగా కంపోజ్ చేస్తున్నార‌ని ద‌ర్శ‌కనిర్మాత‌లు చెబుతున్నారు. ఇక అలానే ఈ సినిమాలో క‌ట్ లేకుండా ఉండే 3 నిమిషాల నిడివిగ‌ల స‌న్నివేశాల్ని కూడా చిత్రీక‌రిస్తున్నామ‌ని, ఇవి ప్రేక్ష‌కుల‌కి ఓ స‌రికొత్త అనుభూతిని ఇస్తాయ‌ని యూనిట్ సభ్యులు తెలిపారు.  

KGF Touch to Naga Shourya Next Film:

KGF Fight Masters for Naga Shourya Next Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ